చిత్తూరు
Sunday, January 7, 2018 - 18:17

చిత్తూరు : తిరుపతి అలిపిరిలో సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో కర్రపట్టుకుని రహదారిపై హల్ చల్ చేశాడు. టూరిజం ఉద్యోగి ప్రభాకర్ పై దాడి చేశాడు. అతన్ని వారించిన నలుగురిపై దాడి చేశాడు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సైకోను బంధించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతన్ని ఆస్పత్రికి తరలించి, సైక్రియాటిక్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, January 5, 2018 - 21:38

తిరుపతి : మార్చి రెండోవారం నుంచి తిరుపతిలోనూ సర్వదర్శనం టైంస్లాట్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. తిరుపతిలో కూడా భక్తులు బస చేయడానికి వీలుగా 2 వేల 5 వందల వసతి గదుల నిర్మాణం చేపడతామని.. చెప్పారు. అలాగే సర్వదర్శనం టైంస్లాట్‌ విధానం విజయవంతమైందని అన్నారు.

 

Friday, January 5, 2018 - 18:58

చిత్తూరు : శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ తాంత్రిక పూజల వివాదం.. చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా వేడాం గ్రామం వద్ద గల భైరవకోనలోని కాల బైరవుని ఆలయంలో సూపరింటెండెంట్‌ ధనపాల్‌ క్షుద్ర పూజలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఓ వీడియో కూడా.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆలయ అధికారులు కూడా.. ధనపాల్‌ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆలయ ఈవో ఆ...

Friday, January 5, 2018 - 15:48

చిత్తూరు : జిల్లాలోని మదనపల్లిలో బీటీ కాలేజ్‌ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. జన్మభూమి సభలకు యాజమాన్యం బలవంతంగా విద్యార్ధులను తరలిస్తోంది. సభలకు వెళ్లకుంటే టీసీలు ఇచ్చి పంపిస్తామంటూ యాజమాన్యం బెదిరిస్తుందంటూ విద్యార్ధులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. తమను బలవంతంగా జన్మభూమి సభలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, January 5, 2018 - 13:20

చిత్తూరు : ఆలయాల్లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయా ? ఎందుకు చేస్తున్నారు ? ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా మరో ఆలయంలో తాంత్రిక పూజలు చేసినట్లుగా ఉన్న వీడియోలు హల్ చల్ చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తిలో ఈ ఘటన జరిగినట్లు కలకలం రేపుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా కాల భైరవ ఆలయం ఉంది. దీనికి భైరవకొన అని పేరు కూడా...

Thursday, January 4, 2018 - 14:59

చిత్తూరు : బీసీ సర్టిఫికేట్ అందుకున్న రోజే మాకు నిజమైన పండుగ అని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు ఉద్యమాన్ని ఆపలేదని.. మార్చి 31 వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. కాపు నేతలతో తిరుపతిలో జరిగిన సమావేశంలో ముద్రగడ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదన్నారు ముద్రగడ. పవన్‌ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని.. కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని...

Thursday, January 4, 2018 - 14:59

చిత్తూరు : బీసీ సర్టిఫికేట్ అందుకున్న రోజే మాకు నిజమైన పండుగ అని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు ఉద్యమాన్ని ఆపలేదని.. మార్చి 31 వరకూ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. కాపు నేతలతో తిరుపతిలో జరిగిన సమావేశంలో ముద్రగడ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదన్నారు ముద్రగడ. పవన్‌ను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని.. కేవలం సినిమాల్లో మాత్రమే చూశానని...

Wednesday, January 3, 2018 - 18:43

చిత్తూరు : తిరుపతిలో ఫార్మా డి విద్యార్థులు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆరేళ్ళ కోర్సు పూర్తి చేసినా...ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకునేనాథుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

Tuesday, January 2, 2018 - 18:30

చిత్తూరు : జిల్లా శేషాచలం ఆడువుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ చేస్తుండగా వారికి ఎర్రచందనం స్మగ్లర్లు కట్టపడడంతో వారి లొంగిపోమ్మని పోలీసులు హెచ్చరించారు. కాని వారు రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయాడు. పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

Pages

Don't Miss