చిత్తూరు
Thursday, April 20, 2017 - 15:36

చిత్తూరు : గంగవరం మండలం మబ్బువారిపేటలో దారుణం జరిగింది.. స్కూల్‌లోనే లేడీ టీచర్‌ను ఉపాధ్యాయుడు పొడిచి చంపాడు.. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రేమ కుమారిపై అదే స్కూల్‌లోని టీచర్‌ చంద్రమౌళి కత్తితో దాడిచేశాడు.. తీవ్రగాయాలపాలైన ప్రేమకుమారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది..  

Wednesday, April 19, 2017 - 18:44

చిత్తూరు: పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తిరుమలలో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భక్తులు ఎండ వేడిమికి అవస్థలు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించడానికి టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయం వద్ద కార్పెట్లు ఏర్పాటు చేసి.. నీటితో తడుపుతున్నారు. 

Saturday, April 15, 2017 - 14:38

చిత్తూరు : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవో గా చేయడానికి ఐఏఎస్ లు పోటీ పడుతోన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ టీటీడీ ఈవోగా చేయడానికి ఉత్సహాం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేక్ చెందిన ఐఏఎస్ లు కూడా పోటీ పడుతున్నారు. ఓ అడుగు ముందుకేసి ఉత్తరాది వారికి అవకాశం ఇవ్వోద్దంటూ ఏపీ ఐఏఎస్ అధికారుల అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఈవొగా తన...

Saturday, April 15, 2017 - 06:52

చిత్తూరు : పాత కరెన్సీ నోట్లు టీటీడీకి పెనుభారంగా మారాయి. హుండీల్లో కుప్పలు.. తెప్పలుగా పడుతున్న పాత నోట్లతో అధికారులు సతమతమవుతున్నారు. ఈ విషయంలో ఆర్‌బీఐ ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో అయోమయంలో పడ్డారు టీటీడీ అధికారులు. పాత కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయంతో కుదేలైన ప్రజలు దాని నుంచి బయటపడినా... శ్రీవారు మాత్రం ఇంకా బయటపడలేదు. ఇంకా తిరుమల శ్రీవారి హుండీలోకి రద్దైన పెద్దనోట్లు భారీగా...

Friday, April 14, 2017 - 14:28

చిత్తూరు : ఏపీ టీడీపీలో రోజు రోజుకు అసమ్మతి పెరిగిపోతునట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై తమకు స్థానం దక్కలేదని పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉండడమే కాకుండా రాజీనామాలు కూడా చేసేశారు. విజయవాడలో కేశినేని నాని పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు 16 శాతం ఉంటే కేవలం 2...

Thursday, April 13, 2017 - 11:54

చిత్తూరు : తిరుమలలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సర్కార్ పై పలు విమర్శలు గుప్చించారు. గురువారం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పేదలకు ఇళ్లు కట్టించని చంద్రబాబు హైదరాబాద్‌లో మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకున్నారని రోజా విమర్శించారు. వసతులు లేకుండానే అమరావతికి ఉద్యోగులను హడివుడిగా తరలించారని, పక్క...

Tuesday, April 11, 2017 - 08:27

తిరుమల : తుంబూరుతీర్థంలో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి తిరుపతికి చెందిన ఇన్ కం ట్యాక్స్ ఉద్యోగి గా గుర్తించారు.

Sunday, April 9, 2017 - 07:50

చిత్తూరు : తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలిరోజు వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈరోజు శ్రీనివాసుడు స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరించనున్నాడు. రేపు ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు.

 

Thursday, April 6, 2017 - 09:18

చిత్తూరు : లారీల సమ్మె తీవ్రతరమౌతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా లారీ యజమానులు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వాలు స్పందించకపోతుండడంతో నేటి నుండి సమ్మెలో నిత్యావసర సరుకులు రవాణా చేసే లారీలు పాల్గొంటున్నాయి. దీనితో ఇప్పటికే పెరిగిన ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తిరుమలలోని శ్రీవారి లడ్డూపై...

Monday, April 3, 2017 - 15:41

చిత్తూరు: బ్యాంకు ముఖం చూడకుండానే ఆ రైతులకు 14కోట్ల రూపాయల రుణం మంజూరయింది. కాని..ఒక్కపైస కూడా వారికి చేరలేదు. రైతుల పేరుతో కోట్లరూపాయలను పాలప్యాక్టరీ తన గల్లాపెట్టెలో వేసుకుంటే.. నోటీసులు మాత్రం రైతులకు ఇచ్చింది బ్యాంకు. అప్పు నోటీసులు అందుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. చిత్తూరుజిల్లాలో ఓ మిల్క్‌డెయిరీ నిర్వాకంపై టెన్‌టీవీ ఫోకస్‌..

రైతులకు...

Pages

Don't Miss