చిత్తూరు
Thursday, September 28, 2017 - 07:32

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవల కన్నుల పండువగా సాగింది. శ్రీదేవి,భూదేవీ సమేతంగా శ్రీనివాసుడు మాడవీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వరోజు బుధవారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీనివాసుడు.. సాయంత్రం గరుడవాహనంలో ఊరేగారు. గరుడ వాహనంపై వూరేగుతున్న స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

...

Wednesday, September 27, 2017 - 19:57

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి గరుడసేవకు భక్తులు పోటెత్తారు. రాత్రి 7.30 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు ఊరేగనుండటంతో.. తిరుమాడవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లలేక మాడవీధుల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్న ప్రసాదాల పంపిణీల్లో జాప్యం నెలకొనడంతో.. భక్తులకు పాట్లు తప్పడం లేదు. 

Wednesday, September 27, 2017 - 12:35

చిత్తూరు : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి శ్రీవారు తిరుమాడవీధుల్లో గరుడవాహనంపై ఊరేగనున్నారు. గరుడవాహన సేవను తిలకించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకున్నారు. దీంతో టీటీడీ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడవాహన సేవ భద్రతకు సంబంధించి డీఐజీ ప్రభాకర్‌ రావు టెన్ టివితో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో...

Tuesday, September 26, 2017 - 12:44

చిత్తూరు : తిరుమల కొండపై దేవదేవుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు.

Monday, September 25, 2017 - 12:11

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం సింహవాహనంపై శ్రీనివాసుడిని ఊరేగించారు. సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ జరుగనుంది. ఇదిలా ఉంటే మూడో రోజైన సోమవారం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీనితో భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు. తిరుమల నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చూడటానికి భక్తులు సందడి అంతగా...

Sunday, September 24, 2017 - 22:03

చిత్తూరు : జిల్లా మిట్టిండ్లు గ్రామంలో విషాదం జరిగింది. ఈతకోసం చెరువుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. 

Sunday, September 24, 2017 - 19:38

చిత్తూరు : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం.... తిరుమల శ్రీవారు చిన శేషవాహనంపై విహరించారు. రాత్రికి వీణాపాణియైు హంస వాహనంపై దర్శనమిస్తారు. మరోవైపు బ్రహ్మోత్సవాలు, సెలవులతో తిరుమలపై రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది...

Pages

Don't Miss