చిత్తూరు
Sunday, October 1, 2017 - 07:30

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం పుష్కరణిలో జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. చక్రస్నానానికి భారీగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. 

Saturday, September 30, 2017 - 08:56

చిత్తూరు : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా సాగుతోంది. రథోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. దేవేరులతో కలిసి సర్వాంగ సుందరంగా ముస్తాబైన మలయప్పస్వామి రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతున్నారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాల్గొంటున్నారు. 

 

Saturday, September 30, 2017 - 08:36
Friday, September 29, 2017 - 16:27

చిత్తూరు : జిల్లాలో ఇద్దరు రౌడీషీటర్ల దారుణహత్య సంచలనం రేపింది. సీటీఎం మండలం పెద్దపల్లిలో అమర్‌నాథ్‌, జగదీశ్వర్‌రెడ్డిపై దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. అత్యంత క్రూరంగా నరికి చంపారు. అయితే ఐదుగురి హత్య కేసులో మృతులు అమర్‌నాథ్‌, జగదీశ్వర్‌రెడ్డి నిందితులుగా ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, September 29, 2017 - 08:33

చిత్తూరు : జిల్లా చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ఐటేపల్లి వద్ద నాలుగు బస్సులు ఢీకొన్నారు. ముందువెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Friday, September 29, 2017 - 08:04

చిత్తూరు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి గజవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. గజవాహన సేవను చూసి తరించేందుకు భక్తులు తరలిరావడంతో తిరుమాడవీధులు కిటకిటలాడాయి. తిరుమలలో వర్షం కువరడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. సాయంత్రం చంద్రప్రభ...

Friday, September 29, 2017 - 07:56

చిత్తూరు : టీటీడీ చైర్మన్‌గా ఖరారైన పుట్టా సుధాకర్‌యాదవ్‌.. కడవ జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారల్లో చురుగ్గాల పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్‌ పేరును టీటీడీ చైర్‌పదవికి ఖరారు చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం...

Pages

Don't Miss