చిత్తూరు
Sunday, February 14, 2016 - 10:51

చిత్తూరు : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. 

Saturday, February 13, 2016 - 21:20

చిత్తూరు : ప్రియురాలిని ప్రియుడే హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం అమిలేపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. నక్కలవారిపల్లికి చెందిన ఎంసీఏ చదివిన వేమనారాయణరెడ్డి పునుగు పల్లెకు చెందిన సబీహాను ప్రేమ పేరిట మోసం చేసి హత్యచేశాడు. బెంగళూరులో ఉద్యోగం చూశానని చెప్పి తనతో తీసుకెళ్లి.. ఆమెను హత్యచేసి తన స్వగృహమైన నక్కలవారిపల్లెలో పూడ్చి పెట్టాడు. తల్లి,...

Saturday, February 13, 2016 - 19:01

చిత్తూరు : తిరుపతిలో బీసీ నేత రామచంద్రయ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అరెస్ట్ సమయంలో.. ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకొని.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని రామచంద్రయ్య నిరసిస్తూ ఆమరణ దీక్ష చేపట్టారు. 

Saturday, February 13, 2016 - 14:47

తిరుమల : రథ సప్తమి వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథ సప్తమి సందర్భంగా శ్రీనివాసుడు ఒకేరోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నాడు. భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ...

Saturday, February 13, 2016 - 14:46

చిత్తూరు : తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాతం సేవలో పాల్గొన్న ఆమెకు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. 

Saturday, February 13, 2016 - 14:45

చిత్తూరు : తిరుమల శ్రీవారికి కోయంబత్తూరుకు చెందిన బాలమురుగన్‌ దంపతులు వజ్ర కిరీటాన్ని కానుకగా అందజేశారు. వీఐపి బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న బాలమురుగన్‌ దంపతులు.. స్వామివారికి ఈ కిరీటాన్ని అందజేశారు. ఉత్సవర్లు మలయప్ప స్వామివారికి అలంకరించేందుకు వీలుగా దాత ఈ కిరీటాన్ని తయారు చేయించారు. 

Saturday, February 13, 2016 - 14:41

హైదరాబాద్ : పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ప్రియురాలిని చంపి ఇట్లోనే పాతి పెట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం నక్కలవాండ్లపల్లిలో దారుణం  గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్.వేమనారాయణరెడ్డి (30) వాయల్పాడులో ఓ నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎఫ్.సబియా అనే యువతి ఎంబీయే అనంతరం నారాయణరెడ్డి నెట్ సెంటర్‌లో...

Thursday, February 11, 2016 - 18:35

తిరుపతి : బలిజ, కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో బీసీ సంఘాలు నిరాహార దీక్ష చేస్తున్నారు. అఖిల భారత యాదవ జాతీయ సంఘం ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య ఆమరణ దీక్ష చేస్తున్నారు. నేడు రెండోరోజు పలు బీసీ సంఘాలు ఈ దీక్షకు మద్దతు ప్రకటించాయి.

Wednesday, February 10, 2016 - 15:40

తిరుపతి : తిరుమల లో శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఉత్సవం రథసప్తమి.. ఈ నెల 14 న జరగనున్న రధసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీనివాసుడు ఒకేరోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శమివ్వనున్నారు. ఇందుకు గాను టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు , వికలాంగులు , వృద్దులు చంటిపిల్లల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Tuesday, February 9, 2016 - 14:47

తిరుమల : అలనాటి సినీనటి రాధ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తె కార్తీక, భర్తతో కలిసి తిరుమల వచ్చారు. రాధ కుమార్తె కార్తీక ప్రస్తుతం కథానాయకిగా ఉన్నారు. టిటిడి అధికారులు విఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో రాధ కుటుంబ సభ్యులు దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.తన భర్త ... బర్త్‌ డే సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్టు...

Tuesday, February 9, 2016 - 13:30

చిత్తూరు : రెండ్రోజుల క్రితం శేషాచలం అడవుల్లో తప్పిపోయిన సౌందర్య, నవీన్‌ల ఆచూకి లభ్యమైంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న నవీన్‌, సౌందర్య ఈ నెల ఆరో తేదీన అదృశ్యమయ్యారు.ద అయితే నిన్న తండ్రికి ఫోన్‌ చేసిన సౌందర్య తాము అడువల్లో తప్పిపోయామని సమాచారం అందించింది. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలించిన అధికారులు వీరిని పెండ్లిమర్రి మండలం పీకిబండ్ల అటవీ ప్రాంతంలో గుర్తించారు....

Pages

Don't Miss