తూర్పు-గోదావరి
Tuesday, July 25, 2017 - 08:03

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో... విద్యార్థులు కదం తొక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటు చేసుకుంది. అలాగే కడపలోని కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని.....

Tuesday, July 25, 2017 - 07:15

తూర్పుగోదావరి : ప్రశాంతంగా ఉండే కోనసీమ గంభీరంగా మారిపోయింది. వేలాది మంది పోలీసుల పహారాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాపు ఉద్యమనేత ముద్రగడ చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కోనసీమ పోలీస్‌ పహరాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను కోనసీమకు...

Monday, July 24, 2017 - 19:46

తూర్పుగోదావరి : కాకినాడలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులు కదం తొక్కారు. కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు భారీగా హాజరైన విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టల్స్‌ మూసివేత తగదంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

Monday, July 24, 2017 - 15:57

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ భవనంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ...

Monday, July 24, 2017 - 09:21

తూర్పు గోదావరి : ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు పికెట్ లు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడి పోలీసుల దిగ్భంధనంలోకి వెళ్లింది. ఆధార్ కార్డు చూపిస్తేనే పోలీసులు గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ముద్రగడ ఇంటి వద్ద పోలీసులు వీడియా పై ఆంక్షాలు విధించారు. జిల్లాలోని కాపు నేతల ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు...

Sunday, July 23, 2017 - 16:25

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రి కాస్మో పోలిన్ క్లబ్‌లో బ్యాడ్మింటన్ స్టార్‌ పివి సింధును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ ఆవరణలో సింధు మొక్కలు నాటారు. 

Saturday, July 22, 2017 - 15:45

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 26న ముద్రగడ పాదయాద్ర ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ బందోబస్తు చేపట్టారు. జిల్లాలోని కాపు జేఏసీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, July 21, 2017 - 13:29

తూర్పు గోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఎస్పీ గున్నీ పోలీసులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటమని ఎస్పీ తెలిపారు. ఇవాళ్లి నుంచి కిర్లంపూడిలో 144 సెక్షన్ అమలు చేయనున్నామని పేర్కొన్నారు. ర్యాలీలు నిర్వహించేవారికి వినకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి. 

Thursday, July 20, 2017 - 13:44

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేట పంచాయితీ పరిధిలో వందేళ్ల క్రితం పిఠాపురం మహారాజు జంతు హింస నివారణ సంస్థకు స్థలం దానం చేశారు. ఇప్పుడది నానాటికీ చిక్కుతూ వస్తోంది. ఈ సంఘంలో పశువుల కెపాసిటీకి 250 పశువులకు మించకూడదు. కాని చుట్టుపక్కల ఎక్కడ అక్రమ రవాణా జరిగినా ఈ సంఘానికే తరలిస్తారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే సంఘంలో పశువుల సంఖ్య వేలల్లో ఉండాలి. కాని...

Wednesday, July 19, 2017 - 21:02

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీపై పోలీసులు దాడిచేశారు. అర్బన్‌ జిల్లా పరిధిలోని రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు. ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న నిమ్మన నాగేశ్వర్రావుని అరెస్ట్‌ చేసి, 36 లక్షల విలువైన గుట్కా బస్తాలను, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. 

Pages

Don't Miss