హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...
ప్రకాశం : ప్రత్యేక హోదా కోరుతూ సీపీఎం నేతలు చేపట్టిన ప్రదర్శనపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీపీఎం నేతలపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు అనుసరించిన వైఖరిని నిరసిస్తూ బీజేపీ దేశ వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. అందులో భాగంగా భీమవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకాశం చౌక్ లో ఉపవాస దీక్ష...
కాకినాడ : ఆయిల్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ ఆ పోర్ట్..ఇతర సరుకు రవాణాలో కూడా ఆ పోర్ట్‌లో మాఫియా రాజ్యమేలింది. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మాఫియాలకు చెక్ పడుతోంది... ఎగుమతులు దిగుమతుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో ఆ పోర్ట్ ఆదాయంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. కాకినాడ పోర్టు..గడిచిన పదేళ్లుగా మాఫియా కనుసన్నుల్లో నడుస్తూ వచ్చిన పోర్టు...
విజయవాడ : దళితుల హక్కులపై చర్చించేందుకు ఈనెల 16వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై తీర్పుపై తీవ్ర విమర్శలు..చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను కోరడం జరిగిందని, జాతి ప్రయోజనాల కోసం ముందుకు రావాలని కోరారు. దళితుల...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ మండలస్థాయి వరకూ.. సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు కూడా.. అసెంబ్లీ వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించి తన నిరసనను తెలియపరిచారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. ర్యాలీల్లో పాల్గొన్న...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిస్టు, జనసేన శ్రేణులు పాదయాత్రలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లోనూ పార్టీల నాయకులు, ఉత్సాహంగా పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు కోరుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు.. జనసేన...
తూర్పుగోదావరి: ఏపీకి హోదా కల్పించాలని ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. కాకినాడలోని కుంభాభిషేకం రేవులో ఎమ్మెల్యే కొండబాబు జలదీక్ష చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నట్టేట ముంచారని పేర్కొన్నారు. కొండబాబు చేసిన జలదీక్షకు స్థానిక మత్స్యకారులు మద్దతు పలికారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.