తూర్పు-గోదావరి
Wednesday, July 15, 2015 - 16:22

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, భూతద్ధంలో చూపిస్తున్నాయని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ విమర్శించారు. ప్రతి సంఘటనకు సీఎం రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేయడం సబబు కాదన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనలో 31 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశాయి. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జూపల్లి...

Wednesday, July 15, 2015 - 11:58

తూ.గో: రాజమండ్రి పుష్కర ఘాట్లను దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు అభిప్రాయపడ్డారు.

Tuesday, July 14, 2015 - 19:32

రాజమండ్రి: చంద్రబాబు తీరువల్లే రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. వీఐపీలకు కేటాయించిన సరస్వతీ ఘాట్‌లోనే చంద్రబాబు పుష్కర స్నానాలు చేసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. పబ్లిసిటీ కోసం సాధారణ ప్రజలు స్నానాలు చేసే పుష్కర ఘాట్‌లో చంద్రబాబు స్నానాలు చేశారని..భక్తులను రెండున్నర గంటలు ఆపి ఒక్కసారిగా వదలడంతో తొక్కిసలాట జరిగిందన్నారు....

Tuesday, July 14, 2015 - 17:25

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరఘాట్‌ తొక్కిసలాట మృతుల కుటుంబాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని వెంటనే అందజేయాలని, క్షతగాత్రులకు వైద్య సదుపాయాలు అందజేయాలని జగన్‌ కోరారు.

 

Tuesday, July 14, 2015 - 16:49

తూర్పుగోదావరి: రాజమండ్రిలోని కోటగుమ్మం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పుష్కరాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విషాదమని మంత్రి అన్నారు. ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. లక్షలాదిగా తరలివచ్చే పుష్కరాలకు ప్రభుత్వం మరింత పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలన్నారు.

 

Tuesday, July 14, 2015 - 16:44

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు పవన్‌ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. క్షతగాత్రులకు సానుభూతి కలగాలని ఆశిస్తున్నానని పవన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజమండ్రికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నా.. మళ్లీ తొక్కిసలాట జరుగుతుందేమోనని...

Tuesday, July 14, 2015 - 16:38

రాజమండ్రి: నిర్లక్ష్యం నిలువునా ముంచేసింది. నమ్మకం నట్టేట కలిపేసింది. ఆహ్వానాల్లో ఉన్న ఆర్భాటం.. ఏర్పాట్లలో లేకపోవడంతో అమాయకులు బలయ్యారు. సీఎంతో సహా వీఐపీలంతా ఒకే ఘాట్‌పై అందరి దృష్టి పడేలా చేయడంతో.. అందరి దారి ఆ ఘాట్‌ వైపే వెళ్లింది. ఆ దారి గోదారే అయింది. మూడు గంటలపాటు కట్టిపడేసి ఒక్కసారే వదిలేసిన అధికారుల అలసత్వం.. పెను విషాదానికి కారణమైంది. ఆరాటంలో పరుగులు పెట్టిన...

Tuesday, July 14, 2015 - 16:29

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇన్ని చర్యలు తీసుకున్నా తొక్కిసలాట జరగడం దృరదృష్టకరమని చంద్రబాబు అన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను చంద్రబాబు ప్రకటించారు. కంట్రోల్‌ రూం నుంచి ఆయన పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు....

Tuesday, July 14, 2015 - 15:01

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పుష్కరాల ప్రారంభం రోజునే మహా విషాదం నెలకొంది. రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాజమండ్రి పుష్కరఘాట్ మొదటి ద్వారం వద్ద జరిగిన తీవ్ర తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగానే గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని...

Tuesday, July 14, 2015 - 13:36

హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న పుష్కరాల్లో తప్పులు జరుగుతాయని ఊహించాం కానీ ఇంత పెద్ద ఘటన జరుగుతుందని ఊహించలేదన్నారు. సి.రామచందయ్య నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఓ కమిటీ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. అక్కడ కనీసం ఏలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, 14వ...

Tuesday, July 14, 2015 - 13:32

హైదరాబాద్ : పుష్కరాల్లో రాజమండ్రిలో జరిగిన ఘటనపై ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనం ఆయన అభివర్ణించారు. ఏపీ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. లక్షలాది మంది యాత్రికులు వస్తారని అంచనా లేకపోవడం దురదృష్టకరమన్నారు. యాత్రికులను ఎలా పంపించాలో పక్కా శాస్త్రీయ పద్దతులు అవలించలేదన్నారు. జరుగుతున్న ఏర్పాట్లపై బీజేపీ నేత...

Pages

Don't Miss