తూర్పు-గోదావరి
Wednesday, January 13, 2016 - 13:54

కాకినాడ : ప్రముఖ కవి, సాహితీవేత్త అద్దేపల్లి రామ్మోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనార్యోగంతో బాధపడుతున్నారు. కాకినాడలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామ్మోహన్ మృతి పట్ల పలువురు కవులు, రచయితలు, సీపీఎం నేతలు సంతాపం తెలిపారు.
1936, సెప్టెంబరు 6న బందరు సమీపంలోని చింతగుంటపాలెంలో పుట్టారు. తండ్రి హిందూ కాలేజీలో గుమస్తాగా పని చేసేవారు. ఎలాంటి సాహిత్య...

Monday, January 11, 2016 - 14:32

తూర్పుగోదావరి : జిల్లాలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. కోనసీమలోని కాలేజీల్లో వేడుకలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థినిలు సంక్రాంతి పిండివంటలపై పోటీలు పెట్టుకున్నారు. వివిధ రకాల వంటలతో అదరగొట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Monday, January 11, 2016 - 09:34

తూ.గో : కాకినాడలో బీచ్‌ ఫెస్టివల్‌ చివరిరోజు అదిరిపోయింది... డ్యాన్సులు, పాటలతో హోరెత్తిపోయింది.. బాబా సైగల్‌ స్పెషల్‌ కుర్రకారును ఉర్రూతలూగించింది.. చివరిరోజు ఈ వేడుకల్ని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. దీంతో బీచ్‌కు వెళ్లేదారుల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.. 

Saturday, January 9, 2016 - 13:33

తూర్పుగోదావరి : కోడి పందేల నిర్వహించొద్దని హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే కోడి పందేల నిర్వహణకోసం పందెం పుంజులను పెంపకందార్లు సిద్ధం చేస్తున్నారు. వాటిని పెంచే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని వారు అంటున్నారు. విదేశాల నుంచి సైతం పందేల కోసం వస్తుంటారని పందెం కోళ్ల యజమానులు చెబుతున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి. 

Saturday, January 9, 2016 - 13:30

కోడి పందేలను అడ్డుకోండి. ఇదీ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌. ప్రభుత్వం కూడా ఓ యస్‌.. అలాగే అడ్డుకుంటామంటోంది. కానీ కోడిపందాలు జరిగే కోనసీమలో సిచ్యుయేషన్‌ మరోలా ఉంది. సమరానికి కోళ్లను సిద్ధం చేస్తున్నారు. రకరకాలుగా పందే కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు హెచ్చరించినా అసలు కార్యక్రమాలు బాగానే జరిగిపోయాయి. మరి ఈసారి సంక్రాంతి బరిలో ఎవరు గెలవబోతున్నారు..? కోడి పందేలు నిర్వహించి...

Saturday, January 9, 2016 - 13:25

తూర్పుగోదావరి : సంక్రాంతి పందాలకు మేము రెడీ అవుతున్నాం. కత్తులు కట్టుకుని కాళ్ళు దువ్వుతున్నాం.. కాయ్ రాజా కాయ్ అనే పందెం రాయుళ్ళ కూత కోసం గెలుపు గుర్రాల్లా ఎదురుచూస్తున్నాం.. మాతో పందేలు నిర్వహించొద్దంటూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసినా పొలిటికల్‌ సార్ల సిఫార్సులు ఎలాగో ఉన్నాయి కాబట్టి పందేలు జరిగిపోతాయనుకుంటున్నాం. ఇంతకు మీరు రెడీయేగదా.? ఇలా అంటున్నది మరెవరోకాదు ప్రాణాలు...

Thursday, January 7, 2016 - 12:47

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినుండి 10 రూపాయలు వసూలు చేయాలన్న దానిపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. బలవంతపు వసూళ్లు సరికాదని స్వచ్చందంగా విరాళాలు ఇస్తే మాత్రమే తీసుకోవాలని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం నిమిత్తం మై క్యాపిటల్ మై అమరావతి మై బ్రిక్ ద్వారా పది రూపాయలు వసూలు చేయాలని ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చింది...

Wednesday, January 6, 2016 - 15:30

తూర్పుగోదావరి : కోనసీమలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలు పండగ శోభతో కళకళలాడుతున్నాయి. అమ్మ చేతి కమ్మని వంటలు.. అందాల పరికినీ వోణీలు..  కోడి పుంజుల రంకెలు.. ఊరేగింపు సందడులు ఇలా గ్రామాల్లో సంక్రాంతి సందడే వేరు. ముఖ్యంగా కోనసీమలో మూడురోజుల పాటు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతాయి. పల్లెటూళ్ళకు పట్టుకోమ్మలా ఉండే కోనసీమలో సంక్రాంతి ఏవిధంగా ఉంటుందో ఓ సారి మనమూ చూసొద్దాం....

Wednesday, January 6, 2016 - 09:07

అమలాపురం : మరోసారి కల్తీ మద్యం ఒకరి ప్రాణాలు తీసింది. ఇటీవలే విశాఖపట్టణంలో స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఐనవెల్లి (మం) వీరవల్లిపాలెంలో కల్తీ మద్యం సేవించి సత్తిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. సత్తిబాబు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలున్నారు. మంగళవారం రాత్రి ఓ బెల్ట్...

Sunday, January 3, 2016 - 20:35

తూర్పుగోదావరి : విజయవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారం సద్దుమనుగకముందే... తూర్పుగోదావరి జిల్లాలో మరో 'కాల్‌మనీ-సెక్స్ రాకెట్' తరహా దందా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లాలో అప్పులు తీసుకున్న మహిళలు వాటిని తీర్చలేకపోతే... దుబాయిలో ఉద్యోగానికి వెళ్లాలని దళారులు బెదిరిస్తున్నారు. అలా వెళ్లిన వారిని.. దుబాయ్‌ లో వ్యభిచార ముఠాలకు అప్పగిస్తున్న వైనం వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా...

Friday, January 1, 2016 - 12:52

తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో దారుణం జరిగింది. కార్మికనగర్ లోని ఆశానగర్ వంతెన వద్ద కొప్పుల ప్రసన్నకుమార్ ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటన జరుగుతుండగా అడ్డుకున్న మరో ఇద్దరు వ్యక్తులపై కూడా దుండగులు దాడి చేశారు. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు....

Pages

Don't Miss