తూర్పు-గోదావరి
Sunday, July 12, 2015 - 06:26

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. పుష్కర పనుల్లో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. ఉద్యోగులే దీనికి కారణమని భావించిన సీఎం బాబు వారిని సస్పెండ్ చేశారు. రాజమండ్రికి శనివారం చేరుకున్న సీఎం ఆకస్మిక తనిఖీలతో అధికారులను బెంబేలెత్తించారు. పుష్కర పనుల్లో జరుగుతున్న అలసత్వంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మధురపూడి...

Saturday, July 11, 2015 - 22:01

రాజమండ్రి: మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమరణదీక్షను పోలీసులు భగ్నం చేశారు. హర్షకుమార్ ను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతకముందు హర్షకుమార్‌ తన రివాల్వర్‌తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు, క్రైస్తవ సంఘాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Saturday, July 11, 2015 - 19:31

తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులపై సీఎం మండిపడ్డారు. సంబంధిత విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

 

Saturday, July 11, 2015 - 17:57

కాకినాడ: ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. కాకినాడలో మధు మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన తర్వాత సెక్షన్‌-8 గుర్తొచ్చిందా.. అని విమర్శించారు. ఏపీలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మధు పూర్తి మద్దతు ఉటుందన్నారు. ఈ నెల 31న విజయవాడలో జరిగే రాష్ట్ర...

Saturday, July 11, 2015 - 16:32

కాకినాడ: ఎపి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నెలకొల్పిన మద్యం షాపును వెంటనే తొలగించాలని కాకినాడలో మహిళలు ఆందోళనకు దిగారు. రామారావుపేట నైట్‌ హోటల్‌ సెంటర్‌లో ధర్నాకు దిగిన మహిళలకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబుపై మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడిన...

Thursday, July 9, 2015 - 18:15

చిత్తూరు : గోదావరి పుష్కరాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరికి సమర్పించడానికి శ్రీవారి ఆలయం నుంచి సారె రాజమండ్రికి బయలుదేరింది. స్వామి వారి విగ్రహం, పసుపు, కుంకుమ తదితర పూజాసామాగ్రితో కూడిన ప్రత్యేక వాహనం రాజమండ్రికి బయలదేరింది. వాహనం తిరుచానూరు, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడల మీదుగా రాజమండ్రి పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. ఈ నెల 14న సీఎం చేతుల మీదుగా గోదావరికి సారెను...

Wednesday, July 8, 2015 - 12:04

అతివల అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయ మహిళలు.. అందులో తెలుగువాళ్లకు చీర అంటే మహా ఇష్టం. చీరల్లో చేనేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది. అయితే నేతన్నల నైపుణ్యం వారి కడుపులు మాత్రం నింపలేకపోతుంది. చాలీచాలని సంపాదనతో ఎలా బతకాలో అర్ధం కాక నేతన్నలు నానా అవస్థలు పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న ఉప్పాడ చీరలు నేసే చేనేత కార్మికుల వెతలపై 10టీవీ...

Sunday, July 5, 2015 - 17:01

తూర్పుగోదావరి: గోదావరి పుష్కర ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. రాజమండ్రి కోటి లింగాల రేవులో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న స్నానఘట్టం ఓమత్స్య కారుడిని బలి తీసుకుంది లలలఘాట్‌ నిర్మాణ పనులు పూర్తయినా నదికి అడ్డుకట్ట వేసిన మట్టిని తొలగించడంలో కాంట్రాక్టర్‌ అలసత్వం ప్రదర్శించాడు. ఫలితంగా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఎదుర్లయ్య అనే మత్స్యకారుడు మట్టిలో దిగబడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు...

Sunday, July 5, 2015 - 13:29

తూర్పుగోదావరి : జిల్లాలోని మలికిపురం మండలం గూడవల్లికి చెందిన కట్టా సింహాచలం అనే అంధ యువకుడు సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించాడు. జాతీయస్థాయిలో 1,212 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గ్రూప్ - బి అధికారిగా పని చేస్తున్నారు. సింహాచలం టెన్ టివితో తన విజయ రహస్యాలను పంచుకున్నారు. అంధత్వాన్ని జయించి జీవితంలో పైకిరావాలన్న పట్టుదలే ఈ ఉన్నత పరీక్షల్లో...

Pages

Don't Miss