తూర్పు-గోదావరి
Thursday, December 7, 2017 - 06:36

రాజమండ్రి : ఫైనాన్స్‌ వ్యాపారంలో నష్టం రావడంతో ఏదోలా కోట్లు గడించాలనుకున్నాడా ఆ ప్రబుద్ధుడు... ఒక్కనెలలో కోటీశ్వరుడైపోవాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లు సంక్రాంతి పండగను లక్ష్యంగా చేసుకుని.. అచ్చు అసలు నోట్లలా నకిలీ నోట్లను తయారుచేసేయడం మొదలెట్టాడు. అత్తమామింట్లోనే మకాం పెట్టేసి... చివరికి పోలీసులకు పట్టుబడి.. కటకటాలపాలయ్యాడు.. ఆ దొంగనోట్ల ముఠా నాయకుడు

ఇక్కడ...

Tuesday, December 5, 2017 - 09:27

తూర్పుగోదావరి : జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట రామాలయం వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ ఇల్లు దగ్ధమైంది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు గృహ యజమాని పాఠంశెట్టి వెంకట్రావు కుటుంబం సభ్యులు బయటకు తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోని సామాగ్రి కాలిబూడిదైంది. రెండు లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు....

Monday, December 4, 2017 - 18:37

తూర్పుగోదావరి : శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కాపు రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి బాధ్యతను తామే తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. దశాబ్ధాల పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో బీసీల ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది వుండదని హామీ ఇచ్చారు.

Monday, December 4, 2017 - 13:58

కాకినాడ : కాపులను బీసీలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడలో బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. బీసీ సంఘ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. కాపులను బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలరాస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Monday, December 4, 2017 - 11:38

తూర్పుగోదావరి : అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసానికి కొదువలేదని నిరూపించారు విభిన్న ప్రతిభావంతులు. కాకినాడ జేఎన్‌టీయూలో వికలాంగుల సంక్షేమ శాఖ నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పలు పాఠశాలలకు చెందిన బాలబాలికలు సంగీతం, నృత్య ప్రదర్శనల్లో తమ ప్రతిభను చాటారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం బహుమతులు ప్రధానం చేశారు. 
 

 

Saturday, December 2, 2017 - 13:42

తూర్పుగోదావరి : కాపులకు బీసీ హోదాపై పలువురు మండిపడుతున్నారు. వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి కూడా సిద్ధమంటున్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ నిర్ణాయాన్ని కూడా ధిక్కరిస్తానంటున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌. నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, December 1, 2017 - 21:10

విజయవాడ : కాపుల రిజర్వేషన్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘంగా దీనిపై చర్చించింది. ఈ భేటీ కంటే ముందుగా మంజునాథ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. కేబినెట్ లో మంజునాథ కమీషన్ సభ్యులు పాల్గొన్నారు.

గత ఎన్నో సంవత్సరాలుగా కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో...

Friday, December 1, 2017 - 11:53

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు అవరోధాలు తొలిగేటట్టు కనిపించడం లేదు. ఆది నుంచి పోలవరం ప్రాజెక్ట్‌కు ఆటంకాలు, సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను తక్షణం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రాజెక్ట్‌ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నిధుల...

Pages

Don't Miss