తూర్పు-గోదావరి
Saturday, November 11, 2017 - 10:12

తూర్పుగోదావరి : జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజ్ లు భయపెడుతున్నాయి. గెయిల్ గ్యాస్ పైపు లైన్ లు లీకేజ్ కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లీకేజ్ లు కావడం..తూ తూ మంత్రంగా మరమ్మత్తులు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మల్కిపురం మండలంలోని శంకర గుప్తం ప్రాంతంలో శనివారం ఉదయం గ్యాస్ పైపు లైన్ లీకేజ్ అయ్యింది. వెంటనే...

Wednesday, November 8, 2017 - 16:02

తూర్పుగోదావరి : పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ్టికి ఏడాదవుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను తెలియజేస్తూ విపక్షాలు బ్లాక్‌డేని పాటిస్తున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. సామాన్య ప్రజానీకం చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని సీపీఎం నేతలు మండిపడ్డారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

Wednesday, November 8, 2017 - 06:41

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చే రోజు అతి దగ్గరలేనే ఉందని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కాపు కళ్యాణ మండపంలో ఈ రోజు జరిగిన కార్తీక వనసమారాధనలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు ఎటువంటి అన్యాయం జరగకుండా కాపులను బీసీలుగా గుర్తింపు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్‌ ద్వారా లోన్లు ఇస్తున్నామని అనేక మంది కాపు విద్యార్ధులను...

Monday, November 6, 2017 - 18:42

కాకినాడ : అప్రకటిత విద్యుత్ కోతలతో జీజీహెచ్ ఆసుపత్రి రోగులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానమైన ఎక్స్ రే సేవలు నిలిచిపోతున్నాయి. దీనితో దూర ప్రాంతాల నుండి వచ్చే ఔట్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్ కో అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వ్యవహరించడమే కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాఘవేంద్ర పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో నెలకొన్న...

Monday, November 6, 2017 - 13:58

తూ.గో : జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు. ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి.. బొటానికల్ గార్డెన్‌కు శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో ఎమనిటీస్ సెంటర్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం...

Monday, November 6, 2017 - 12:39

తూ. గో : నన్నయ యూనివర్సిటీకి చాలా భవిష్యత్ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో ఎన్ టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1857లో ఆర్ట్స్ కాలేజీ ఏర్పాటు చేశారని... ఆ తర్వాతే ఏయూ యూనివర్సీటీ స్థాపించారని చెప్పారు. ఈ యూనివర్సీటీ నుంచే అడవి...

Sunday, November 5, 2017 - 17:14

తూర్పుగోదావరి : జగన్ అనుమతి కోరడం వల్లే పాదయాత్రకు గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ ఇవ్వడం జరిగిందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. సోమవారం నుండి జగన్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను అడ్డుకోవాలని..చంద్రబాబు నాయుడికి వణుకొచ్చిందని పార్టీ నేత రోజా వ్యాఖ్యానించారని కానీ వాస్తవానికి జగన్..కు వైసీపీకి వణుకు వచ్చిందని...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Pages

Don't Miss