తూర్పు-గోదావరి
Tuesday, August 29, 2017 - 13:08

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం వర్షం పడడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి అనంతరం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. జగన్నాథపురంలో ఏఏస్పీ దామోదర్ ఓటింగ్..భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు....

Tuesday, August 29, 2017 - 12:14

కాకినాడ : కార్పొరేషన్ తమదేనని, ఓటర్లు టిడిపికి పట్టం కడుతారని ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్ ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ప్రశాంతంగా కొనసాగుతున్నా అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు పోలింగ్ బూత్ లను పరిశీలిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కొండబాబుతో టెన్ టివి ముచ్చటించింది. కొంత మంది రెబల్స్...

Tuesday, August 29, 2017 - 12:11

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 20వ వార్డులో ఇద్దరు అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది. 39వ వార్డులో ఇరువర్గాల మధ్య...

Tuesday, August 29, 2017 - 11:38

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంతంగా మొదలైందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రాజకీయ వేడి తగిలింది. 20వ బూత్ లో ఏటిమొగ ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. ఇక్కడ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ తనయుడు బరిలో నిలుచున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీకి చెందిన బలమైన నేత బరిలో ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద సత్యనారాయణ..వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం..తోపులాట...

Tuesday, August 29, 2017 - 10:47

కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలలో నోటా ఆప్షన్ లేకపోవడంపై ఓటర్లు తీవ్ర అభ్యంతరం తెలియచేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కావడంతో నోటా ఆప్షన్ పెట్టలేదని అధికారులు పేర్కొన్నారు.

ఉదయం వర్షం పడుతుండడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం 9గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు....

Tuesday, August 29, 2017 - 08:11

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. వర్షం కారణంగా మందకొడిగా పోలింగ్ సాగుతోంది. పలు ప్రాంతాల్లో కరెంటు లేకపోవడంతో చీకటిలోనే పోలింగ్ కొనసాగిస్తున్నారు. ఐదో నెంబర్ బూత్ లో కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్ జరుగుతోంది.

7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి....

Tuesday, August 29, 2017 - 07:15

తూర్పుగోదావరి : మరో గంటలో కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌... సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే కాకినాడ ఓటరు ఎవరిపై కరుణ చూపుతారన్నదరి ఉత్కంఠ రేపుతోంది.

కాకినాడ నగరపాలక సంస్థలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి....

Sunday, August 27, 2017 - 21:16

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కిర్లంపూడి నుంచి రాజుపాలెం మీదుగా వీరవరం చేరుకున్న ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, ముద్రగడతోపాటు ఆయన అనుచరులను అరెస్టు చేశారు. మరోవైపు కిర్లంపూడిలోని...

Pages

Don't Miss