తూర్పు-గోదావరి
Monday, February 12, 2018 - 18:42

పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో రాష్ట్ర కార్యవర్గం...

Monday, February 12, 2018 - 18:31

రాజమహేంద్రవరం : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడం ఇప్పుడు జాతీయ అంశంగా మారిందని ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్డీయే మిత్రపక్షాలు ఆందోళనలో ఉన్నాయని, రాష్ట్ర బంద్ తో కేంద్రంపై ఏపీ ప్రజలు ఆగ్రహం ప్రకటించారని తెలిపారు. మార్చి 5వ తేదీ వరకు ఆశగా ఎదురు చూస్తామని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోయే కమిటీపై...

Monday, February 12, 2018 - 13:45

తూర్పుగోదావరి : ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న పాలకుల హామీలు మాటలకే పరిమతమయ్యాయి. అందుకు నిదర్శనమే తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలోని ప్రభుత్వ ఆస్పత్రి. సామర్లకోట పట్టణం, మండలంలో మొత్తం కలిపి లక్షా 50వేల మంది జనాభా ఉన్నారు. కాని వీరికి తగిన వైద్యసదుపాయాలు మాత్రం అందడలేదు. సామర్లకోట ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితిపై మరింత సమాచారం వీడియో చూడండి.

Friday, February 9, 2018 - 18:48

తూర్పుగోదావరి : ఏపీలో.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను అయోమయంలో పడేసే చర్యలు చేపట్టాయని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. తనను అమిత్‌షా తిట్టినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనను వైసీపీ కోవర్ట్‌ అనడాన్ని కూడా సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. 

Thursday, February 8, 2018 - 15:13

విజయవాడ : విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు వైసీపీ, ప్రజా సంఘాల పూర్తి మద్దతు పలికాయి. నగరంలోని విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. విభజన హామీలు .. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటాలు ఆపమంటున్న వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది.

ఒంగోలు......

Thursday, February 8, 2018 - 10:13

తూర్పుగోదావరి : బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే అన్ని వర్గాలు స్వచ్చందంగా బంద్‌ పాటిస్తున్నాయి. కాకినాడలో బంద్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం... 
పశ్చిమగోదావరి  
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌లో పాల్గొన్న వామపక్ష నేతలతో పాటు వైసీపీ,...

Thursday, February 8, 2018 - 08:51

తూర్పుగోదావరి : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీలో వామపక్షాలు కదంతొక్కుతున్నాయి. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినడాలో తెల్లవారజామునుంచే బంద్‌ జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Monday, February 5, 2018 - 20:43

తూర్పుగోదావరి : రాజమండ్రి రావులపాళెంలో హర్షవర్దన్‌ లిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. అండర్ 19 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో  నాలుగోసారి వరల్డ్‌ కప్‌ సాధించి రికార్డ్‌ సృష్టించిన భారత జట్టు విజేతలకు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. 

 

Monday, February 5, 2018 - 16:05

తూర్పుగోదావరి : రాజమండ్రిలో సోము వీర్రాజు ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశారని నిరసిస్తూ వీర్రాజు ఇంటిని ముట్టడించారు. సామరస్యంగా నిరసన తెలియజేస్తున్న తమపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని విద్యార్థులంటున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది....

Saturday, February 3, 2018 - 11:25

తూర్పుగోదావరి : నీట్ కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జూనియర్లు..సీనియర్ల మధ్య ర్యాగింగ్ ఘటన కలకలం రేగింది. ఓ బీహార్ విద్యార్థినిని సీనియర్లు రాగ్యింగ్ చేశారని తెలుస్తోంది. దీనితో శుక్రవారం రాత్రి జూనియర్లు..సీనియర్లు ఘర్షణ పడ్డారు. వీరిలో కొంతమందికి గాయాలయినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ర్యాగింగ్ కు పాల్పడిన కొంతమంది...

Pages

Don't Miss