తూర్పు-గోదావరి
Thursday, October 26, 2017 - 19:17

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, మల్లిఖార్జుననగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతలక్ష్మీ, అరుణకుమారిలిద్దరూ ఇంట్లోనే కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్క అనంతలక్ష్మీకి వివాహమైంది. ఆమె తన భర్తతో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక...

Wednesday, October 25, 2017 - 11:42

తూర్పుగోదావరి : పోలవరం నిర్మాణం ఇప్పట్లో జరుగుతుందా ? లేదా ? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రాజెక్టు పనుల నిర్మాణ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల పలు గ్రామాలు ముంపునకు గురవుతున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో కూడా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీనితో నిర్వాసితుల కోసం ఏపీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఎకరానికి రూ. 10 లక్షలు...

Tuesday, October 24, 2017 - 15:01

తూర్పుగోదావరి :  కలుషిత ఆహారం తిని 48మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బీసీ బాలికల వసతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఉదయం తిన్న అల్పాహారం వికటించి బాలికలు అస్వస్థకి గురైనారు.  వీరిలో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరందరిని మెరుగైన వైద్యం కోసం పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను ఆర్డీవో, జిల్లా వైద్య...

Monday, October 23, 2017 - 11:27

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైళ్లో రిమాండ్‌లో ఉన్న రవి అనే ఖైదీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటనందూరుకు చెందిన రవి గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టవ్వడంతో సెంట్రల్‌ జైలులో ఉంచారు. తనతో పాటు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టయిన వారు జైల్లో చాలామందే ఉన్నారు. ఏళ్లు గడిచినా.. బయటికి రాని పరిస్థితి ఉండటంతో.. మనస్థాపానికి గురైన రవి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

...
Monday, October 23, 2017 - 11:24

గుంటూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కార్తీక సోమవారం, నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మొదటి కార్తీక సోమవారం కావడంతో.. క్షీరా రామ లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని గోదావరి ఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడాయి. దీనికి తోడు నాగుల చవితి పర్వదినం కూడా కలిసి రావడంతో భక్త జనం నదీ తీరానికి...

Monday, October 23, 2017 - 11:22

తూర్పుగోదావరి : జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్ సర్వసభ్యహాలులో ఉపాధి హామీ సిబ్బంది తాగుతూ మీడియాకు చిక్కారు. ఉన్నతాధికారులు కూర్చోవల్సిన సీట్లలో ఫీల్డ్ అసిస్టెంట్లు అర్థనగ్నంగా కూర్చుని మందు, సిగరెట్లు తాగుతూయ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూద్దాం....

Sunday, October 22, 2017 - 19:43

రాజమండ్రి : చట్టసభల్లో బీసీలకు పూర్తి స్థాయి రిజర్వేన్లు పొందినప్పుడే నిజమైన రిజర్వేషన్లు సాధించినట్టని బిసి సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. రాజమహేంద్రవరంలో బీసీ గర్జన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో వివిధ బీసీ కులాల నేతలు గర్జన సభలో తీర్మానాలు చేశారు. బీసీ గర్జన ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు కృష్ణయ్య. 

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Pages

Don't Miss