తూర్పు-గోదావరి
Friday, October 20, 2017 - 20:09

తూర్పుగోదావరి : జిల్లాలో జయదీపిక దారుణ హత్య సంచలనం సృష్టించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తండ్రి తలపై రాడ్డుతో కొట్టి చంపేశాడు. స్థానిక యువకుడిని ప్రేమించిందనే కోపంతో పరువు హత్యకు పాల్పడ్డాడు. ప్రేమను మరిచిపోవాలని బెదిరించాడు. అయినా ఆమె వినలేదు. దీంతో దీపికకు మేనమామతో పెళ్లి నిర్ణయించారు. త్వరలోనే వివాహం జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి దీపిక నాలుగు రోజుల క్రితం దారుణ...

Friday, October 20, 2017 - 18:11

తూర్పుగోదావరి : జిల్లాలో పరువు హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ (రాజు), ఆయన కుమారుడిపై హత్యారోపణలు పెల్లుబికాయి. దీనితో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కానీ హత్యకు సంబంధించి కన్న కొడుకు పైనే రాజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన కొడుకే కుమార్తెను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నట్లు సమాచారం.

నందుల రాజు ఇప్పటికే ఒక...

Friday, October 20, 2017 - 09:52

తూర్పుగోదావరి : కార్తీకమాసం సందర్బంగా రాజమహేంద్రవరం గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శుద్ద పాడ్యమి అయిన ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తే శుభం జరుగుతుందన్న విశ్వాసంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, గౌతమిఘాట్‌లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కార్తీకమాసంలో నది స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని భక్తులంటున్నారు.

Wednesday, October 18, 2017 - 20:22

తూర్పుగోదావరి : దీపావళి.. వెలుగులు నింపి చీకట్లను పారద్రోలే పండగ. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి. కానీ ఈ ఏడాది దీపావళి సంబరాలు అంతంతమాత్రంగానే ఉండేలా ఉన్నాయి. కేంద్రం జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం ఇప్పటికే పలు రంగాల మీద పడింది. చివరకు ప్రధాని కూడా జీఎస్టీ దోషం తనది కాదన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండగ పూట నాలుగు టపాసులు కాలుద్దామనుకున్నవారికి.....

Wednesday, October 18, 2017 - 20:02

తూర్పుగోదావరి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తోంది. అనేక చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Wednesday, October 18, 2017 - 13:33

కాకినాడ : పండగంటే ఉత్సాహం.. పండగంటే సంబరం.. పండగంటే ఆనందం. అందులోనూ దీపావళి పండగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టపాసులు కాలుస్తూ పిల్లలు చేసే సందడి.. ప్రతీ ఇంటిలో కొత్త కాంతులు నింపుతుంది. కానీ ఈ ఏడాది ఆ ఆనందానికి అడ్డుకట్ట పడుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు కలవరపడుతున్నారు. దీపావళి సామాగ్రి మీద పడిన జీఎస్టీ భారంతో నిరాశ ఆవహించింది. ...

Monday, October 16, 2017 - 12:08

తూర్పుగోదావరి : జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట వద్ద బోరు వేస్తుండగా గ్యాస్ బయటకు ఎగజిమ్ముతోంది. 70 అడుగుల మేర గ్యాస్ ఎగజిమ్ముతుండడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. రొయ్యల చెరువు కోసం బోరు వేయడంతో గ్యాస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Sunday, October 15, 2017 - 16:04

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బి.జె.పి. నేతలు అడ్డుపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. అభివృద్ధికి సహకరించకపోగా అవినీతి పెరిగిపోయిందని సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల.. ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుపడటం ఎంతవరకు సమంజసమని...

Saturday, October 14, 2017 - 13:00

 

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయం దాదాపు 3,100 చదరపు గజాల స్థలంలో ఉంది. 1898లో ప్రారంభమైన కందుకూరి వీరేశలింగం పంతులు గ్రంథాలయం, వాసురయ గ్రంథాలయం కలిపి 1979లో ఇది ఏర్పడింది. లక్షా 30 వేల పుస్తకాలున్న ఈ గ్రంథాలయంలో.. 30 వేల పుస్తకాలు చాలా అరుదైనవి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఎక్కడా లభించని అపురూపమైన పుస్తకాలు గౌతమీ గ్రంథాలయంలో ఉన్నాయి....

Friday, October 13, 2017 - 15:40

తూర్పుగోదావరి : జగన్‌ ప్రతిపక్ష నాయుకుడిగా ఉండటం మా అదృష్టమని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జగన్‌ తలకిందులుగా తపస్సుచేసినా జగన్‌ను ప్రజలను నమ్మరని చెప్పారు. జగన్‌.. తన వికృత ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. 

...

Pages

Don't Miss