తూర్పు-గోదావరి
Tuesday, December 26, 2017 - 13:43

తూర్పుగోదావరి : న్యూస్‌ ఈజ్‌ పీపుల్‌ అంటూ ప్రజలకు చేరువైన 10టీవీ.. కొత్త సంవత్సర కేలెండర్‌ను ఆవిష్కరించింది. టెన్‌టీవీ రూపొందించిన కాకినాడ నగర కేలండర్‌ను శ్రీఅక్షర హాస్పిటల్స్‌ అధనేత డాక్టర్‌ బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ గాయత్రి సంయుక్తంగా ఆవిష్కరించారు. సమాజికాంశాలను ప్రతిబింబిస్తున్న టెన్‌టీవీ ప్రజలకు మరింత చేరువకావాలని వక్తలు ఆకాంక్షించారు. 

Tuesday, December 26, 2017 - 07:38

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వెల్ల గ్రామంలో.. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ మూడో ఫేజ్‌ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 21 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందులో 9 ఎకరాల 10 సెంట్ల భూమికి... రైతులకు నష్టపరిహారం చెల్లించి...ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 400 కుటుంబాలకు...

Monday, December 25, 2017 - 19:19

గుంటూరు : ఏపీలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. విశాఖలోని సెయింట్‌ పాల్స్‌ చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకలు మిన్నంటాయి. క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు ప్రభోదించిన బైబిల్‌ను ప్రతి ఒక్కరూ చదవి క్రీస్తు బోధనలను పాటించాలని చర్చ్‌ ఫాదర్‌లు సూచించారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలో యేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Sunday, December 24, 2017 - 18:48

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు అవసరమైతే కాఫర్‌ డ్యామ్‌ను వెంటనే నిర్మించుకోవచ్చని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ సలహాదారు సంజయ్‌ కోలా పుల్కర్‌ స్పష్టం చేశారు. కాఫర్‌ డ్యామ్‌ అవసరంలేదని తాను చెప్పిన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సంజయ్‌ తోసిపుచ్చారు. పోలవరం పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజయ్‌... 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 

Friday, December 22, 2017 - 12:38

కాకినాడ : బీచ్ ఫెస్టివల్ చివరి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ టీం ప్రదర్శన ఘనంగా సాగింది. రెహ్మాన్ తన బృందంతో కలిసి తెలుగు..తమిళం..హిందీ పాటలు పాడుతూ ప్రజలను ఉర్రూతలూగించారు. రాష్ట్రానికి చెందిన నేతలు..అధికారులు పాల్గొని రెహ్మాన్ సంగీతాన్ని ఆస్వాదించారు. 

Friday, December 22, 2017 - 06:49

ప్రకాశం : కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రోటోకాల్‌ నుంచి పాసుల వరకూ తగాదాలే తగాదాలు. నిర్వాహణ లోపం.. సందర్శకులకు నిరాశ పరిస్తే.. అధికారుల వ్యవహార శైలి వివాదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. కోట్లు గుమ్మరించి... నిర్వహిస్తున్న కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. ఏర్పాట్లలో లోపాలు.. అధికారుల వ్యవహార శైలి వల్ల.. కార్యక్రమం...

Pages

Don't Miss