గుంటూరు
Monday, March 27, 2017 - 12:50

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ..రాష్ట్రాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుపతి విమానాశ్రయంలో తాము నిరసన తెలిపినందునే అరెస్టు చేసి జైలుకు పంపిన...

Monday, March 27, 2017 - 12:46

అమరావతి: పోలీస్‌ అధికారులమీద దౌర్జన్యం మంచిపద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. అనుచరులు, అధికారం ఉందికదా అని.. దౌర్జన్యాలకు దిగడాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్య చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఆయన సంఘీభావం తెలిపారు.

Monday, March 27, 2017 - 12:43

అమరావతి: విశాఖ భూకబ్జాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని... మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. నివేదిక వచ్చినతర్వాత ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు.. తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

Monday, March 27, 2017 - 12:42

అమరావతి: విశాఖలో కబ్జారాయుళ్ల అరాచకాలు దారుణంగా ఉన్నాయని.. ప్రభుత్వం దృష్టికితెచ్చారు.. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు.. రైతులను నమ్మించి, బెదిరించి వెయ్యి ఎకరాల అసైన్డ్‌ భూముల్ని ఆక్రమించారని ఆరోపించారు.. అందులో రోడ్లుకూడా వేశారంటూ అసెంబ్లీలో కొన్ని ఆధారాల్ని చూపారు.. ఈ అన్యాయంపై హౌస్‌ కమిటీవేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు..

Monday, March 27, 2017 - 11:39

అమరావతి: బాబు వస్తే జాబు వస్తుందన్న హామీకి ఇప్పటికీ కట్టుబడిఉన్నామని... అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగభృతి కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు

Monday, March 27, 2017 - 11:35

అమరావతి: విజయవాడ ఆర్టీఏ ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం సాగింది.. టిడిపి నేతలకు ఉద్యోగులంటే లెక్కలేదని వైసీపీ నేతలు అసెంబ్లీలో మండిపడ్డారు.. ఉద్యోగస్తులను పని చేసుకోనివ్వడంలేదని విమర్శించారు... ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏమైందని ప్రశ్నించారు.. వీటిపై స్పందించిన కాల్వ శ్రీనివాసులు... క్షమాపణతో ఇది ముగిసిపోయిందని స్పష్టం...

Monday, March 27, 2017 - 11:33

అమరావతి: గోదావరి పుష్కరాల్లో 27మంది మృతి ఘటనపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ నడిచింది.. ఈ దుర్ఘటనపై ఇంకా ఎన్నిరోజులు విచారణ కొనసాగుతుందని... వైసీపీ సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన మంత్రి యనమల... విచారణ తర్వాత రిపోర్ట్‌ రాగానే తగు చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు..

Monday, March 27, 2017 - 08:40

హైదరాబాద్: టాలీవుడ్ లేటెస్ట్‌ మూవీ కాటమరాయుడు చిత్రాన్ని... తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వీక్షించారు. అనంతరం హీరో పవన్‌ కల్యాణ్‌కు, డైరెక్టర్‌ డాలీతో పాటు చిత్రబృందానికి కేటీఆర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమా ద్వారా చేనేతకు ప్రచారకర్త దొరికాడని పవన్‌పై కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పవన్‌...

Monday, March 27, 2017 - 06:54

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏపీ సర్కార్ దృష్టిసారించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల దిగువన బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించాలని వినిపిస్తున్న డిమాండ్ .....

ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో పెండింగ్‌...

Monday, March 27, 2017 - 06:48

గుంటూరు : రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలోని రైల్వేకాలనీలో నిరాశ్రయులైన బాధితుల కోసం అవసరమైతే జైలుకు వెళతానని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 40 సంవత్సరాలుగా రైల్వేకాలనీలో జీవిస్తున్న వారికి ఇళ్లు ఖాళీ చేయమని రైల్వే బోర్డు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా సీఎం చంద్రబాబు మోహం చాటేస్తున్నారని విమర్శించారు.

Sunday, March 26, 2017 - 21:14

హైదరాబాద్ : విభజన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు నిర్ణయించాయి. ఉద్యోగుల బదలాయింపు, ఆస్తుల పంపకం, సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాల అప్పగింత, 42 కార్పొరేషన్ల విభజన వంటి అంశాలను పరస్పర చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏర్పాటైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు రాజ్‌భవన్‌లో...

Pages

Don't Miss