గుంటూరు
Wednesday, August 16, 2017 - 07:31

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ఆస్పత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. దిగ్గజ ఆస్పత్రి యాజమాన్యాలు క్యాపిటల్‌ సిటీలో తమ బ్రాంచులు నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. వారం క్రితం బి.ఆర్. శెట్టి మెడ్ సిటీకి శంకుస్థాపన కాగా... బుధవారం ఉదయం ఇండో యూ.కే ఇన్సిటిట్యూట్‌ ఆఫ్ హెల్త్ మెడ్ సిటికి పునాదిరాయి పడనుంది. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో మెడ్ సిటీ నిర్మాణానికి...

Wednesday, August 16, 2017 - 07:29

గుంటూరు : జిల్లా ఉమ్మడివరంలో బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ బాలుడు చంద్రశేఖర్‌ను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డారు. 

Wednesday, August 16, 2017 - 07:28

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. బాలుడిని క్షేమంగా బోరుబావి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే సీఎస్‌ఆర్‌ ఆంజనేయులు నిరంతరం పర్యవేక్షించారు. సహాయక బృందాలకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ వచ్చారు. 

Wednesday, August 16, 2017 - 07:26

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్‌ మృత్యుంజయుడిగా బయటకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో... మరో గొయ్యి తవ్వి బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది. 11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. బోరు బావిలో 13 అడుగుల లోతున బాలుడు ఉన్నట్లు గుర్తించారు. వర్షంలోనూ...

Wednesday, August 16, 2017 - 07:25

గుంటూరు : బోరుబావిని బాలుడు చంద్రశేఖర్‌ జయించడంతో.. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కొడుకు బోరుబావి నుంచి సజీవంగా తిరిగి రావడంతో తల్లి అనూష హర్షం వ్యక్తం చేస్తోంది. 

Wednesday, August 16, 2017 - 07:23

గుంటూరు : బోరు బావి నుంచి రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో.. గుంటూరు జిల్లా ఉమ్మడివరంలో ఆనందోత్సహాలు మిన్నంటాయి. పిల్లాడిని క్షేమంగా బయటకు తీసిన అధికారులు, సహాయక బృందాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

Wednesday, August 16, 2017 - 07:22

గుంటూరు : బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. చంద్రశేఖర్‌ మృత్యుంజయుడిగా బయటకి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో... మరో గొయ్యి తవ్వి బాలుడిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది. 11 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగింది. బాలుడు మృత్యుంజయుడిగా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం...

Tuesday, August 15, 2017 - 21:05

గుంటూరు : జిల్లాలోని వినుకొండ మండలం ఉమ్మడివరంలో విషాదం చోటుచేసుకుంది. బోరు బావిలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ పడిపోయాడు. బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

Tuesday, August 15, 2017 - 13:31

గుంటూరు : ఏపీ సచివాలయంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి డిప్యూటీ చైర్మన్‌ సుబ్రహ్మణ్యం శాసనమండలి భవనంపై జాతీయ జెండాను ఎగరేశారు. తరవాత అసెంబ్లీ భవనంపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జెండా ఆవిష్కరించారు. దేశంలోని యువశక్తిని, మానవ వనరులను ఉపయోగించుకొని దేశం అభివృద్ధి చెందాలని కోడెల ఆకాంక్షించారు. మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని,...

Monday, August 14, 2017 - 20:04

గుంటూరు : ఇది గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కు. దీనికి ఘనచరిత్రే ఉంది. ఈ పార్క్‌కు గాంధీ పేరును నామకరణం చేసిన నుంచి ఇందులో ఏర్పాటు చేసిన ఆటబొమ్మల వరకు.. ప్రతీదానికో చరిత్ర ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్కు గాంధీ పాదంతో పునీతమైంది. స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి.. కొండా వెంకటప్పయ్య లాంటి సమరయోధులు గుంటూరు జిల్లాలో ముందుండి ఉద్యమాన్ని నడిపారు....

Monday, August 14, 2017 - 18:52

గుంటూరు : యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు గుంటూరు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఇంకా సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్సీ డొక్కా అన్నారు. ఆర్థిక అసమానతలను రూపుమాపి.. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత...

Pages

Don't Miss