గుంటూరు
Friday, March 16, 2018 - 22:04

గుంటూరు : టౌన్‌లో తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ మేరకు ఆయన అతిసారంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలిశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. గుంటూరు బంద్ చేపడతామని పవన్ హెచ్చరించారు.

అభివృద్ధి అంటూ మాటలు చెబుతోన్న ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీరు ఇచ్చే...

Friday, March 16, 2018 - 22:01

గుంటూరు : ప్రత్యేక హోదాపై రాహుల్‌ గాంధీ మద్దతు పలకాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాల్సిన రీతిలో పోరాడతామన్నారు. అవిశ్వాసంపై వైసీపీకి క్లారిటీలేదన్నారు. అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదన్న టీడీపీ మళ్లీ అవిశ్వాసం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

 

Friday, March 16, 2018 - 21:57

గుంటూరు : శాసన మండలిలో  సీఎం చంద్రబాబు.. మోదీ, పవన్‌ కల్యాణ్‌, జగన్‌లపై నిప్పులు చెరిగారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోడానికి జగన్‌ కేంద్రంతో లాలూచి పడుతుంటే.. బీజేపీతో కుమ్మక్కైన  పవన్‌ కల్యాణ్‌ .. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్నారని బాబు  దుయ్యబట్టారు. తమిళనాడు తరహాలో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడ్డారు.  విభజన...

Friday, March 16, 2018 - 21:22

గుంటూరు : తెలుగుదేశం పార్టీ.. ఎన్డీయే కూటమికి తలాఖ్‌ చెప్పింది. అంతేకాదు.. మోదీ సర్కారుపై విశ్వాసం లేదంటూ.. లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస నోటీసునూ అందించింది. గురువారం రాత్రి వరకూ వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామంటూ వచ్చిన తెలుగుదేశం.. అనూహ్యంగా, ఈ ఉదయం.. సొంతంగా అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించింది. దీనికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిని ప్రారంభించింది. అటు...

Friday, March 16, 2018 - 19:08

గుంటూరు : గుంటూరులో తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే గుంటూరు బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. గుంటూరు కార్పొరేటర్లు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అండర్ గ్రౌండ్ పనులు చేపట్టిన వారిని కోర్టుకు ఈడుస్తామని మండిపడ్డారు.

 

Friday, March 16, 2018 - 18:43

గుంటూరు : రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ మాట తప్పారని అన్నారు. అమరావతి నిర్మాణానికి  శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు మర్చిపోయారని బాబు ప్రశ్నించారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో అహ్మదాబాద్‌, ముంబైలో మెట్రో ప్రాజెక్టులకు...

Friday, March 16, 2018 - 16:52

గుంటూరు : కేంద్రప్రభుత్వానికి తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకనా..? అని సీఎం చంద్రబాబు అన్నారు. 'ఎందుకు పోరాటం చేస్తున్నారు..? మేము లేమా 'అని మోదీ అన్నారు. 'మేం పోరాడుతుంటే మాట్లాడదామని కూడా మోదీ పిలవలేదు' అని వాపోయారు. హోదా ప్రయోజనాలు అమలయ్యేలా ప్యాకేజీ ఇస్తామన్నారు. ఏపీ కష్టాలను కేంద్రం అసలు పెట్టించుకోలేదని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దన్నట్లు చెప్పుకొచ్చారు....

Friday, March 16, 2018 - 16:42

గుంటూరు : ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి మోదీ అమరావతి శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చారని..కానీ ఇచ్చిన మాటలను మోదీ నిలబెట్టుకోలేకపోయారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ మెట్రో రైళ్లకు రూ.100 కోట్లు ఇచ్చిన మోదీ ఏపీకి మాత్రం మొండి చేయి చూపించారని విమర్శించారు. ఏపీ ప్రజలంటే కేంద్రానికి ఎందుకంత వివక్ష? ఎంతుకంత చిన్నచూపు? అని ఆవేదనగా ప్రశ్నించారు. 

Friday, March 16, 2018 - 16:13

గుంటూరు : ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగటం అనే అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గత నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని, అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి అడిగానని ఆయన గుర్తు చేశారు. మోదీ సర్కార్ తన చివరి బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రత్యేక నిధులు...

Friday, March 16, 2018 - 14:48

గుంటూరు : ఎట్టకేలకు బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఉదయమే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపబోమని స్పష్టం చేశారు. ఏపీకి నిధులడిగితే డిఫెన్స్ కి నిధులు ఉందొద్దా అంటున్నారు... డిఫెన్స్ కి నిధులు ఇవ్వొద్దని చెబుతామా అని అన్నారు. హోదా ప్రయోజనాలు అమలయ్యేలా ప్యాకేజీ ఇస్తామన్నారని...

Pages

Don't Miss