గుంటూరు
Friday, December 11, 2015 - 18:56

విజయవాడ : సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనలతో చంద్రబాబు సర్కారు నెవ్వెర పోయింది. తమ షరతుల ప్రకారమే రాజధాని కట్టిచ్చి వెళతారని భావిస్తే.. తమకే షరతులు విధించడంతో.. సర్కారు అవాక్కయింది. ఈ షరతులు ఆమోదయోగ్యం కాదంటూ.. ప్రస్తుతానికి మాస్టర్‌ డెవలపర్స్‌ అంశాన్ని పక్కన పెట్టింది. వచ్చే మూడేళ్లలో అమరావతి కోర్‌ కేపిటల్‌ ఏరియాలో.. ప్రభుత్వ భవన నిర్మాణాలతో పాటు.. ప్రైవేట్ రంగంలో భారీగా...

Friday, December 11, 2015 - 18:51

గుంటూరు : మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చారు.. తమ దేశం కన్నా అద్భుతంగా రాజధానిని నిర్మించి ఇస్తామన్నారు.. మీకెందుకు అన్నింటికీ మాదీ పూచీ అన్నారు. దీంతో చంద్రబాబు సర్కారు ఎగిరి గంతేసింది. సింగపూర్‌ సంస్థలనే కోర్‌ కేపిటల్‌ మాస్టర్‌ డెవలపర్స్‌గా ఫిక్స్‌ చేద్దామని నిర్ణయించేసుకుంది. ఇంతలో సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడా సింగపూర్‌ సంస్థలను చూస్తేనే సర్కారు బెదిరి పోతోంది... ఇంతకీ ఏం జరిగింది...

Friday, December 11, 2015 - 18:43

గుంటూరు : విభజన వల్ల రాష్ట్రం నష్టపోయినా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1915లో ఏర్పడిన నరసరావుపేట మున్సిపాల్టీ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబు హాజరై ప్రసంగించారు. అమరావతి నగరాన్ని...

Friday, December 11, 2015 - 16:27

హైదరాబాద్ : వర్షాలు, వరదలతో ఏపీలో 3వేల 760కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు కేంద్ర కరవు బృందాలకు వివరించారు. రాష్ట్రంలో కరవు, వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు... ఇవాళ చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. అల్పపీడనం వల్ల నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.. కరవు, వరద నష్టాలను అంచనావేసి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

Friday, December 11, 2015 - 14:30

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్కాంల రాష్ట్రంగా తయారు చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులు సింగపూర్ కంపెనీలకు ఏ విధంగా కట్టబెట్టారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. 

Friday, December 11, 2015 - 09:45

గుంటూరు : నర్సరావుపేట పురపాలక సంఘం శతాబ్ధి ఉత్సవాలకు ముస్తాబైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు అనేకమంది ప్రముఖులు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ముగింపు ఉత్సవాలను గవర్నర్‌ నరసిహన్‌ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల కోసం పట్టణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణాలు కట్టారు....

Thursday, December 10, 2015 - 19:26

విజయవాడ : మేమొస్తే మీకు జాబులే జాబులు.. ఇంటికో ఉద్యోగమిచ్చి మీ గృహాల్లో ఆనందం నింపుతాను... అంటూ ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు గారు మహత్తరమైన హామీ ఇచ్చారు. బాబొస్తే జాబొస్తుందన్న టీడీపీ నేతల వాగ్దానాలతో.. నిరుద్యోగులందరూ ఆపార్టీకే జై కొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ మాత్రమే నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. కోర్టు కేసుల పేరు చెప్పి కాలయాపన చేస్తూ నిరుద్యోగుల...

Wednesday, December 9, 2015 - 19:31

హైదరాబాద్ : మద్యనిషేధంపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని వైసీపీ నేత పార్థసారథి డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యాలకు దిగి..భూములను లాక్కొనే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు. 

Wednesday, December 9, 2015 - 19:29

ఢిల్లీ : పర్యాటక రంగ అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మతో భేటీ అయ్యారు. పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.. టూరిజంను మౌళికవసతుల రంగంగా డిక్లేర్‌ చేయాలని కోరారు.. రాష్ట్రంలో అభివృద్ది చేయాల్సిన ప్రదేశాలు, ప్రాంతాలకు కేంద్ర సాయంపై చర్చించారు....

Wednesday, December 9, 2015 - 15:30

హైదరాబాద్ : ఏపీలో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రకటించింది. విజయవాడలో కల్తీ మద్యం మృతులను పరామర్శించిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి బుధవారం మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఈ హమీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అలాగే తమ పార్టీ నేతలు మద్యం వ్యాపారంలో...

Wednesday, December 9, 2015 - 15:26

హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని వైసీపీ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. ఆయన మోడీ ప్రభుత్వంతో రాజీ పడ్డారని, కృష్ణా మిగులు జలాలన్నీ ఏపీకే చెందాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలల కోసం కొట్టుకొనే పరిస్థితి కేంద్రం కల్పించడం దారుణమని, ఒకప్పుడు దేవగౌడ ప్రధాని...

Pages

Don't Miss