గుంటూరు
Thursday, July 9, 2015 - 18:27

హైదరాబాద్ : చిన్న చిన్న సమస్యలతో కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లులే.. కన్నబిడ్డల ప్రాణాలను తీస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు.. ఇతర కారణాలతో ఆత్మన్యూనతా భావంతో పసిపిల్లల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు. తాము చనిపోతే పిల్లల భవిష్యత్‌ ఎక్కడా అంధకారమవుతుందని భావిస్తున్న తల్లులు.. తమతోటే పిల్లలను అనంత లోకాలకు తీసుకెళ్లడం అందరిని కలిచివేస్తోంది...

Wednesday, July 8, 2015 - 13:36

గుంటూరు:కోడితాడిపర్రులో రైతుల ఆత్మహత్యల ఘటనపై గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే స్పందించారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రైతుల నుంచి భూమిని తీసుకోబోమని వారికి హామీ ఇచ్చారు. మరోవైపు రైతుల ఆత్మహత్యల ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

 

Wednesday, July 8, 2015 - 11:55

వ్యవసాయం, చేనేత దేశానికి రెండు కళ్లన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. మొదటి కన్ను చూపు కోల్పోతోంది. మరో కంటికి అంతా అంధకారమే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ చేనేత కార్మికుడిని తట్టినా కన్నీటి వ్యధలే కనిపిస్తాయి. ప్రేమనే దారంతో మమకారమనే మగ్గంతోనే చీరలను, వస్త్రాలను నేసే నేతన్నకు ఇప్పుడు దిక్కే లేకుండా పోతోంది. గుంటూరు మంగళగిరి నేతన్న మగ్గంపై చావలేక, బతకలేక జీవచ్చవంలా బతుకు పయనం సాగిస్తున్నాడు.
...

Wednesday, July 8, 2015 - 11:48

గుంటూరు: రైతులు ఆందోళన చేస్తున్నారు. అమృతలూరు మండలం కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ .... రోడ్డెక్కారు. రైతుల మృతితో కోపోద్రిక్తులైన రైతులు ....ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి వామపక్ష పార్టీలతో పాటు పలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. మెయిన్‌రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. రైతుల మృతికి...

Wednesday, July 8, 2015 - 11:45

గుంటూరు: అమృతలూరులో విషాదం నెలకొంది. కోడితాడిపర్రులో ఆలయ భూముల వేలం నిరసిస్తూ రెండు రోజుల క్రితం....ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సత్తయ్య అనే రైతు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ మృతిచెందాడు. కోడితాడిపర్రులో చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన వ్యవసాయ భూములను...ఆలయ అధికారులు వేలం వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామ రైతులకు, ఆలయ అధికారుల మధ్య వివాదం జరిగింది....

Tuesday, July 7, 2015 - 20:30

గుంటూరు : జిల్లా అమర్తలూరు మండలం, కోడితాపర్రులో ఆరుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో చికిత్స పొందుతూ ఓ రైతు చనిపోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల్లో.. దేవాదాయశాఖ అధికారులకు, రైతులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆరుగురు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే గమనించి.. తెనాలి...

Monday, July 6, 2015 - 20:26

గుంటూరు : రాజధాని భూసేకరణకోసం హామీలమీద హామీలు గుప్పించిన ప్రభుత్వం వీటి అమలుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో స్కిల్స్ పెంచే కార్యక్రమం మొదలైంది. ఈ ట్రైనింగ్‌పై హర్షం వ్యక్తమవుతున్నా జాబ్ కు గ్యారంటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్లకు శిక్షణా శిబిరాన్ని...

Monday, July 6, 2015 - 20:21

గుంటూరు : ఏపీ నూతన రాజధానిలో కొలువుల జాతర మొదలైంది. సీఆర్డీఏలోని ఈ ఉద్యోగాలభర్తీలో సిఫార్సులుకూడా అదే స్థాయిలో సాగుతున్నాయి. అయితే ఈ ఉద్యోగాలను అర్హులకే ఇస్తారా? సిఫార్సులకే పెద్దపీట వేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఉద్యోగాలకోసం జోరుగా లాబీయింగ్..
ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థలో ఉద్యోగాల కోసం పైరవీలు జోరుగా సాగుతున్నాయి.. తమకు...

Monday, July 6, 2015 - 14:26

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. వెంటనే లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భజరంగ్ జూట్ మిల్లును అక్రమంగా ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో సుమారు మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సోమవారం నాడు కార్మికులు...

Sunday, July 5, 2015 - 17:12

గుంటూరు: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరం మండల ఎస్సీకాలనీలో.... సుమారు 100 పూరిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో...పూరిళ్లన్నీ కాలిపోయాయి. ప్రమాదంలో ఇళ్లలోని విలువైన వస్తువులతో పాటు నగదు, గ్యాస్‌ బండలు, టీవీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కాలనీవాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు కోటి మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది...

Sunday, July 5, 2015 - 10:31

గుంటూరు : భజరంగ్ జూట్ మిల్లు ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కంపెనీ శనివారం లాకౌట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది. తమకు న్యాయం చేయాలని కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ కు స్థలాన్ని అప్పగించడం వల్లే ఈ లాకౌట్ ప్రకటించారని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని, ఆదిత్య...

Pages

Don't Miss