గుంటూరు
Friday, September 29, 2017 - 19:48

గుంటూరు : రైతులకు ప్రపంచ స్ధాయిలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు  బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి నవంబర్ 15, 16,17  తేదీల్లో విశాఖలో జరిగే సమ్మిట్‌లో ఏపీ ప్రభుత్వం బిల్ అండ్ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. చివరి రోజు జరిగే సమ్మిట్‌లో బిల్‌ గేట్స్ స్వయంగా...

Friday, September 29, 2017 - 08:02

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలకు అల్పపీడీన ద్రోణి ప్రభావం తోడయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తున్నాయి. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట, ఎల్బీనగర్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అల్వాల్‌, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది...

Friday, September 29, 2017 - 07:49

గుంటూరు : తెలంగాణ తరహాలో ఏపీలో కూడా 12వ తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై తర్వలో విధాన ప్రకటన చేయనున్నారు. భాష విషయంలో పొరుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు బోధనను తప్పనిసరి చేశారు. తెలుగు భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....

Thursday, September 28, 2017 - 21:17

గుంటూరు : జిల్లాలోని తెనాలి మారీసుపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడేళ్ల క్రితం మహ్మద్‌ మాబు ఘోరిని లక్ష్మిసౌమ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే లక్ష్మి సౌమ్య తన తల్లిదండ్రులు ఇంటికి రావడం లేదని కలత చెంది ఉరి వేసుకుని చనిపోయిందని ఆమె భర్త మహ్మద్‌ మాబు ఘోరి తెలిపాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం...

Thursday, September 28, 2017 - 13:37

గుంటూరు : సోనోవిజన్‌ 48వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన దసరా డిస్కౌంట్‌ సేల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సోనోవిజన్‌ స్క్రాచ్‌ కార్డ్‌లపై 7 కార్లను బహుమతులుగా అందజేశారు. ఈనెల 25,26,27 తేదీల్లో ఈ బహుమతులు ప్రదానం చేశారు. గుంటూరు సోనోవిజన్‌ షోరూంలో.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లక్కీడ్రా తీసి కారు, ఎల్‌ఈడీటీవీ, రిఫ్రిజిరేటర్‌ అందించారు....

Thursday, September 28, 2017 - 07:35

గుంటూరు : రహదారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌, సీటు బెల్టు నిబంధనలను తప్పనిససి అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు ఎన్నో విలువైన ప్రాణాలు బలితీసుకుంటున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. హెల్మెట్‌, సీటు బెల్టు పెట్టుకోకుండా వచ్చే వాహనచోదకులకు పెట్రోలు, డీజిల్‌ అమ్మకుండా ఆంక్షలు విధించారు.

...

Wednesday, September 27, 2017 - 21:40

గుంటూరు : చంద్రబాబు లండన్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 24, 25 తేదీల్లో పర్యటించనున్న సీఎం... అమరావతి భవన నిర్మాణాల డిజైన్లను ఫైనల్‌ చేయనున్నారు. ఇప్పటికే భవన ఆకృతుల్లో అనేక మార్పులు సూచించిన సీఎం... ప్రత్యేకంగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ సీఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం...

Wednesday, September 27, 2017 - 19:53

గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ఖరారైంది. వచ్చేనెల 24,25 తేదీల్లో ఆయన లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమరావతి నగరం ఆకృతులపై చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఈనెలలో తుది డిజైన్స్ సమర్పించనున్నారు. సీఎం పర్యటన కంటే ముందే వచ్చేనెల 11, 12,13 తేదీల్లో మంత్రి నారాయణ నేతృత్వంలో ప్రతినిధి...

Wednesday, September 27, 2017 - 12:24

గుంటూరు : ప్రకాశం జిల్లా కనిగిరి అత్యాచారయత్నం ఘటనపై సీఎం చంద్రబాబ సీరియస్ గా స్పందించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆయన ఆదేశించారు. సీఎం ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం కింద...

Wednesday, September 27, 2017 - 08:38

ఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తిరుమల శ్రీవారి టికెట్లపై జీఎస్టీ ఎత్తివేత, రాష్ట్రం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీ, ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జీఎస్టీ నుంచి మినహాయింపు వంటి అంశాలపై చర్చించారు. అరుణ్‌ జైట్లీతో...

Pages

Don't Miss