గుంటూరు
Tuesday, September 26, 2017 - 20:09

గుంటూరు : తుళ్లూరు మండలం... మందడం హైస్కూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పాఠశాల వివరాలను తెలుసుకున్నారు. మందడం హైస్కూల్‌ను మోడల్‌ స్కూల్‌గా తయారు చేస్తామని గంటా చెప్పారు. ఇక్కడే వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ కాలేజ్‌ని ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల కోసం ఐదు వేల కోట్లు కేటాయించామని... 18 నెలల్లో అన్ని మౌలిక సదుపాయాలు...

Tuesday, September 26, 2017 - 15:42

విజవాయడ: వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడ ఎంబీ భవన్‌లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వంశధార నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించిన...

Tuesday, September 26, 2017 - 10:45

గుంటూరు : ఎన్నికలకు ముందే ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్‌ చేసిన వైసీపీ అధినేత జగన్‌.. అక్టోబర్‌ 27నుంచి పాదయాత్ర చేస్తానని గతంలో ప్రకటించారు.. ఈ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే... టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. నవరత్నాలు, వైఎస్సార్‌ కుటుంబంలాంటి కార్యక్రమాలనూ ప్రకటించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో పరాజయం తర్వాత పార్టీ నిరాశలో...

Tuesday, September 26, 2017 - 07:29

ఢిల్లీ : ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలు, ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిపిన భేటీలో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించారు....

Monday, September 25, 2017 - 19:52

గుంటూరు : ఏపీ సచివాలయంలో విద్యశాఖ ఉద్యోగులు వివాదాస్పదంగా ప్రవర్తించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పై వేస్ట్ మెటీరియల్ పడెశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, September 25, 2017 - 18:47

గుంటూరు : అమరావతిలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద.. సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తాటికొండ అడ్డరోడ్డునుంచి బస్టాండ్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు.. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయాలయానికి నాన్‌స్టాప్‌ బస్సులు ఏర్పాటు చేసినా... అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని మండిపడ్డారు.. నాన్‌స్టాప్‌ బస్సును ఆర్డినరీ బస్సుగా మార్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.. బయోమెట్రిక్‌ విధానం...

Monday, September 25, 2017 - 18:46

గుంటూరు : శంకర్‌ విలాస్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పునర్‌నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, నక్కా ఆనందబాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి నగరంలో పర్యటించిన ఆయన శంకర్‌ విలాస్‌ బ్రిడ్జిని పరిశీలించారు. 150 కోట్లతో బ్రిడ్జ్‌ నిర్మాణం చేసేందుకు ప్లాన్‌ రూపొందిస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

Monday, September 25, 2017 - 18:42

ముస్సోరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్సోరిలోని అఖిల భారత సర్వీసు అధికారుల శిక్షణ కేంద్రంలో ప్రసంగించారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు మూడు వారాల మిడ్‌ కెరీర్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్‌ అధికారులు, ఫౌండేషన్‌ కోర్సులో ఉన్న ట్రైనీ అధికారుల సంయుక్త సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు....

Monday, September 25, 2017 - 11:38

గుంటూరు : ఏపీ సచివాలయ ఉద్యోగులు బస్సు కోసం ఆందోళన..నిరసన చేపడుతున్నారు. బస్సును ఎక్కడపడితే అక్కడ ఆపుకుంటూ రావడం వల్ల తాము పలు సమస్యలు ఎదుర్కొన్నామని పేర్కొంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సును ఆపిన ఉద్యోగులు కాలినడకన బయలుదేరారు.

ఏపీ రాజధాని అనంతరం వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగులు ఇక్కడకు తరలివచ్చారు. వీరు...

Monday, September 25, 2017 - 07:25

హైదరాబాద్ : సమాచార హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్న బాధ్యత అందరిపై ఉందని పలువురు నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ల నియామకంపై పీపుల్స్‌ ఫోరం ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమాచార హక్కు చట్టంలో నియమించిన కమిషనర్లపై ప్రజాసంఘాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై...

Pages

Don't Miss