కడప
Monday, June 5, 2017 - 17:12

కడప : జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. వ్యక్తిని దారుణ హత్య చేశారు. ప్రొద్దుటూరులో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బాధితున్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, June 5, 2017 - 16:47

కడప : జిల్లాలోని బద్వేలులో 4వ రోజు నవనిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వెలుగు, డీఆర్‌డీఏ , వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీచ బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే జయరాములు అన్నారు. 

Monday, June 5, 2017 - 08:46

 

కడప : జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసిపికి బలమైన జిల్లా. టీడీపీకి మింగుడు పడని ఫలితాలిచ్చే జిల్లా. అయితే ఈసారి టిడిపి కడపజిల్లాలో పాగా వేయాలనుకుంటోంది. అందులో భాగంగా వైసిపితో విసిగిన నేతల్ని పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. పార్టీ బలోపేతం చేసే ఉద్దేశ్యంతో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కడప.. ఆదినారాయణ రెడ్డికి రాజంపేట ఎంపీ...

Sunday, June 4, 2017 - 15:44

కడప : జిల్లాలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టపగలే వ్యక్తిని దారుణ హత్య చేశారు. రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద శ్రీనివాసులురెడ్డిని అమర్ నాథ్ రెడ్డి పొడిచి చంపాడు. శ్రీనివాస్ రెడ్డిని కత్తితో వెంటాడి అమర్ నాథ్ రెడ్డి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Sunday, June 4, 2017 - 11:53

కడప : ఎర్రచందన స్మగ్లర్లపై కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో మూడు వేరు వేరు ప్రాంతాలలో ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో 21 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలతో పాటు 14 సెల్ ఫోన్లు, 12 కిట్ బ్యాగ్‌లు, నాలుగు గొడ్డళ్లు, ఒక రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్మగ్లర్ల...

Sunday, May 28, 2017 - 18:39

కడప : కడప అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్ధానం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన కడపలో ఆ తరువాత వైసిపి పాగా వేసింది. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధికి 50 వేలకు పైగా మెజార్టీతో గెలుపు లభించింది. అయితే ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి గెలిచింది చాలా తక్కువసార్లని చెప్పాలి. టిడిపికి సరైన నేత లేకపోవడం.. ఉన్నా కార్యకర్తలను పట్టించుకోకపోవడం.. ఈ అంశాలనే ఆసరాగా తీసుకుని వైసిపి...

Thursday, May 25, 2017 - 21:47

కడప : చుట్టూ వందల మంది...ఎవరిపనుల్లోవారు బిజీ...మండుతున్న ఎండమరోవైపు..జనం చూస్తుండగానే ఓ ఘోరం..అందరూ అక్కడే ఉన్నా వేటకొడవలితో నరికి..పన్నెండు సార్లు నరికిన ప్రత్యర్థి..ఒకడు పట్టుకుని ఉండగా..మరొకడు నరుకుతూ..ఏ మాత్రం బెరుకులేకుండా పబ్లిక్‌గా మర్డర్..కోర్టు సమీపంలోనే కిరాతకం...కడప గడపలో మరోమారు మానవత్వం మంటగలిసింది...నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా చంపారు...ఆ...

Thursday, May 25, 2017 - 16:45

కడప : కడపజిల్లా వ్యాప్తంగా గత రాత్రి వీచిన భారీ గాలులకు వందలాది ఎకరాల అరటిపంట నేలకూలింది. ఒక్క లింగాల మండలంలోనే వంద ఎకరాల్లో పంట నేలకూలింది. భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కోటిరూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సంవత్సరం పాటు పెంచుకున్న పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 

Wednesday, May 24, 2017 - 21:52

అనంతపురం : రాయలసీమలో ఉరుముతున్న కరువును తరిమేయాలంటూ వామపక్షాలు కదం తొక్కాయి. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నేతలు నినదించారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కామ్రేడ్ల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. మొత్తంగా రాయలసీమ బంద్‌ పిలుపు సక్సెస్‌ అయ్యింది...

Wednesday, May 24, 2017 - 13:20

కడప : రాయలసీమ సమస్యలపై బంద్‌ పిలుపు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కడపలో ఆందోళనకు దిగారు. వేలాది మంది ప్రజలతో భారీ ర్యాలీగా వస్తున్న మధు ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయపక్షాలను కలుపుకుని ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని మధు స్పష్టం చేశారు.

Pages

Don't Miss