కడప
Sunday, August 27, 2017 - 16:33

కడప : నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, గెలుపు అనంతరం వైసీపీ నుండి టిడిపిలోకి వలసలుంటాయని..త్వరలోనే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని మంత్రి ఆది నారాయణ పేర్కొన్నారు. అడ్డుపుల్ల వేస్తే ఎలా ఉంటుందో తెలిసి వస్తుందని నంద్యాల తీర్పు రాష్ట్రంలో సంచలన మార్పులకు తెరలేస్తుందన్నారు. 

Sunday, August 27, 2017 - 16:21

కడప : గడప గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళుతామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళుతోందని, అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకొంటోందన్నారు. కడపలో వర్షపాతం అధికంగా ఉందని..నీరు - ప్రగతి పథకంలో భాగంగా చెక్ డ్యామ్ లో నీళ్లు ఉంటున్నాయన్నారు. అభివృద్ధిని చూసి నంద్యాలలో టిడిపిని గెలిపిస్తారని పేర్కొన్నారు. వెంకయ్య...

Sunday, August 27, 2017 - 15:15

కడప : వినాయక నిమజ్జనోత్సవంలో ఘర్షణ జరిగింది. మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంతూరు గొరిగనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గొరిగెనూరు టిడిపిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గానికి మంత్రి ఆదినారాయణరెడ్డి, మరో వర్గానికి టిడిపి ఎమ్మెల్సీ పొన్నాల రామసుబ్బారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. రామసుబ్బారెడ్డి వర్గం గణేశ్‌ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా మంత్రి ఆదినారాయణరెడ్డి...

Thursday, August 24, 2017 - 16:57

కడప : న్నైకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అహమ్మద్ తంబీ మైథిన్ అలియాస్ ఏ.టి.ఎంను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మైథిన్.. రెడ్ శాండల్ స్మగ్లర్ గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు. నిందితుడి నుంచి కోటి రూపాయల విలువైన 68 ఎర్రచందనం దుంగలతో పాటు కోటి 23 లక్షల విలువైన నాలుగు కార్లతో పాటు పికప్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటుగా వివిధ బ్యాంకుల ఎటిఎం కార్డులు...

Thursday, August 24, 2017 - 11:27

కడప : జిల్లాలో రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా నగరంలోని చిన్న చౌకు, అప్సరా సర్కిల్‌, జయానగర్‌ కాలనీ, చిన్న చౌకు పోలీసు స్టేషన్‌ నీటిలో మునిగిపోయాయి. అప్సరా సర్కిల్‌ నుండి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రహదారి చెరువును తలపిస్తోంది. సరైన మురుగు నీటి వసతి లేక, వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు....

Monday, August 21, 2017 - 18:41

కడప : జిల్లా కాశినాయన మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని.. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. దాదాపు 18వేల ఎకరాల సర్కారు భూమిని.. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు చెందిన పెట్టుబడిదారులు ఆక్రమించారని ఆరోపించారు. ఈ భూమిని పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు.. జిల్లాలో పర్యటించిన ఆయన... ఆక్రమణకు గురైన భూముల్ని పరిశీలించారు...

Sunday, August 20, 2017 - 21:00

కడప : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో చట్టాన్ని కాపాడాల్సిన ఓ హోంగార్డు మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హత్య చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప జిల్లా సుండుపల్లి కి చెందిన  ఆదిలక్ష్మి, బకారాపేటకు చెందిన రాజశేఖర్ తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు సంతానం కాగా ఒకరు మగ పిల్లాడు ముగ్గురు ఆడ పిల్లలు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు మద్యానికి బానిస అయి......

Friday, August 18, 2017 - 13:24

కడప : జిల్లాలోని ప్రొద్దటూరు ప్రభుత్వ ఆసపత్రిలో వైద్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ పై మరో వైద్యుడు డేవిడ్ రాజ్ సిరంజితో డాడి చేశాడు. డేవిడ్ రాజు సిరంజితో లక్ష్మీప్రసాద్ కు హెచ్ ఐవీ వైరస్ ఎక్కించడానికి ప్రయత్నించాడు. డేవిడ్ రాజు హెచ్ ఐవీ రోగి నుంచి బలవంతంగా రక్తనమూనాలను సేకరించారు. వారించిన నర్సులపై కూడా ఆయన దాడికి యత్నించారు. దీంతో అక్కడ...

Tuesday, August 15, 2017 - 19:27

కడప : మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగులోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి, దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దళితులుకు చదువు రాదని.. శుభ్రత తెలియదని..అందుకే వారు వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు. వారికి పట్టా భూములుండవని అవహేలనగా మాట్లాడారు. దళితులకు రిజర్వేషన్లు కల్పించి 70 సంవత్సరాలు గడిచినా వారు అభివృద్ధి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. ...

Thursday, August 10, 2017 - 17:27

కడప : కడప జిల్లాలో చాలా ఏళ్ల నుంచి అన్నీ తానే అన్నట్టుగా సీఎం రమేశ్ వ్యవహరిస్తుంటారు. ప్రతీ నెలా జిల్లాలో కనీసం రెండు, మూడు సార్లయినా పర్యటించి.. ప్రభుత్వ పథకాల ప్రారంభ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. జిల్లా తెలుగు దేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అన్నట్టు ఉండేది సీఎం రమేశ్ వ్యవహారం. కానీ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాక పరిస్థితి మారిపోయింది. సీఎం రమేశ్ కంటే పార్టీ...

Pages

Don't Miss