కడప
Friday, June 29, 2018 - 10:32

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ కోసం అఖిలపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో  భాగంగా ఇవాళ కడపజిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారుల  బైఠాయించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బంద్‌కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ,...

Friday, June 29, 2018 - 08:50

కడప : ఉక్కు పోరాటం ఉధృతమైంది. ఇవాళ అఖిలపక్షాలు కడప జిల్లా బందు పాటిస్తున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామయి. తెల్లవారు జాము నుంచే అఖిలపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. బంద్ కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. 

Thursday, June 28, 2018 - 21:01

కడప : ఉక్కు పరిశ్రమ కోసం 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీక్ష విరమించకపోతే ఆరోగ్యం విషమిస్తుందని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. షుగర్‌, బీపీ పడిపోవడంతో గుండెకు ప్రమాదం పొంచివుందని సూచించిన డాక్టర్లు... దీక్ష విరమించాలని కోరారు. వైద్యుల విన్నపాన్ని తిరస్కరించిన రమేశ్‌... కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై...

Thursday, June 28, 2018 - 20:59

ఢిల్లీ : కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో తమ ఆందోళన ఉధృతం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో బుధవారం నిర్వహించిన భేటీలో స్పష్టమైన హామీ రాకపోవడంతో.. గురువారం రెండో రోజు మంత్రి నివాసం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి మేకాన్‌ సంస్థ నుంచి తుది...

Thursday, June 28, 2018 - 18:35

ఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర మంత్రి ముందు టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. భేటీ అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఎంపీలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించడం జరిగిందని, రెండు అంశాలపై సమగ్ర వివరణాలతో...

Thursday, June 28, 2018 - 12:58

కడప : ఎంపి సీఎం రమేశ్‌ దీక్ష తొమ్మిదో రోజు కొనసాగుతోంది. సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొనసాగుతున్న ఈ దీక్షకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.

 

Wednesday, June 27, 2018 - 21:03

ఢిల్లీ : టాస్స్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉక్కు కర్మాగారం కోసం ప్రభుత్వ, ప్రైవేటు భూమి, ఇనుప ఖనిజం లభ్యత వంటి అంశాలపై అధ్యయం నివేదిక త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ చెప్పారు. ఏడాదికి లక్షన్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రతిపాదించిన కడప...

Wednesday, June 27, 2018 - 21:00

కడప : స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీటెక్‌ రవి దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆస్పత్రికి తరలించకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు సూచించడంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. బీటెక్‌ రవిని రిమ్స్‌కు తరలిస్తుండగా... టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఆరోగ్య పరిస్థితి...

Wednesday, June 27, 2018 - 18:21

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటూ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలొస్తున్నాయి. టిడిపి ఎంపీ సీఎం రమేశ్ దీక్షను సైతం భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారీగా మోహరించిన కార్యకర్తలు పోలీసులను అడ్డుకుంటున్నారు. గత ఎనిమిది రోజులుగా వారు జడ్పీ ప్రాంగణంలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో వారి ఆరోగ్యాలు...

Wednesday, June 27, 2018 - 16:20

ఢిల్లీ : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై టిడిపి ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తుండడంతో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనిపై టిడిపి ఎంపీలు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను టిడిపి ఎంపీలు కోరారు...

Wednesday, June 27, 2018 - 16:05

రాజమండ్రి : కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు జిల్లాలోని జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. టీడీపీ, బీజేపీ ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరింస్తున్నాయని అఖిలపక్షనేతలు మండిపడ్డారు. ఏనాడు ఉక్కు ఫ్యాకర్టీ గురించి ప్రస్తావించని నాయకులు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకు ఉద్యమాని కొనసాగిస్తామంటున్నారు...

Pages

Don't Miss