కడప
Thursday, November 17, 2016 - 16:40

కడప : ప్రధాని నరేంద్రమోడీ పై కడపవాసులు మండిపడ్డారు. నోట్ల రద్దు ప్రకటన చేసి నేటికి తొమ్మిది రోజులు కావస్తున్నా నేటికి ప్రజలకు చిల్లర కష్టాలు తప్పటంలేదు. బ్యాంకుల వద్ద ఉదయంనుండే లైన్లలో నిలబడి పలు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కడప బ్యాంక్ వద్ద ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. దీంతో వారు సహనాన్ని కోల్పోయి ప్రధానిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ కడుపుకు...

Thursday, November 17, 2016 - 12:25

కడప : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్వానికి పాల్పడ్డారు. యువతి మృతి చెంది. జిల్లాలోని బద్వేల్‌ మండలం అగ్రహారంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈఘటనలో యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Monday, November 14, 2016 - 13:54

కడప : జిల్లాలోని పులివెందులలో మరోసారి ఫ్యాక్షన్ పడగవిప్పింది. పులివెందుల నామాలగుండు వద్ద టీడీపీ కార్యకర్త శంకరప్పపై బాంబులు, కొడవళ్లతో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఆయన  తీవ్రంగా గాయపడ్డాతు. శంకరప్ప ఓ కేసులో సాక్షి కావడంతో కావాలనే అతన్ని చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గాయపడిన శంకరప్పను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Friday, November 11, 2016 - 15:31

హైదరాబాద్ : ఏపీలో పనిచేసే ఆరోగ్య మిత్రలకు హైకోర్టు తీపికబురు అందించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేసింది. దీనితో ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది. గత కొన్ని నెలల క్రితం 1600 మంది ఆరోగ్య మిత్రలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఆరోగ్యమిత్రలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తాము ఉపాధి కోల్పోయామని, దీనిని నమ్ముకుని జీవనం...

Wednesday, November 2, 2016 - 20:57

కడప : రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ గేయానంద్‌ ఆరోపించారు. రాయలసీమకు కేటాయించిన ఎస్సై పోస్టులే దానికి నిదర్శనమన్నారు. దాదాపు 152 ఎస్సై పోస్టులు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 50 మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే తమ తప్పు సరిదిద్దుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగడుతామన్నారు. 

 

Monday, October 31, 2016 - 20:10

నెల్లూరు : వీఆర్‌ఏ ఆందోళనలతో నెల్లూరు కలెక్టరేట్ దద్దరిల్లింది. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. చాలీచాలని జీతాలు ఇస్తూ విఆర్ఏల చేత ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి మోహన్ రావు మండిపడ్డారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో వారసత్వ...

Pages

Don't Miss