కడప
Friday, July 21, 2017 - 21:56

కడప : జిల్లాలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరు గోకుల్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని హైందవను దుండగులు గొంతుకోసి చంపారు. హైందవ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు స్కూటీతో దుండగులు పరారయ్యారు. అయితే... బంగారం కోసమే హత్య చేశారా ? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అయితే... ఇటీవలే హైదరాబాద్‌ నుంచి సొంత ఊరు వచ్చిన హైందవ...

Tuesday, July 18, 2017 - 21:39

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదభయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని విశాఖ వాతారణ కేంద్రం తెలిపింది.
48 గంటల్లో..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ...

Tuesday, July 18, 2017 - 20:39

కడప : మన దేశంలో తల్లి, తండ్రి, గురువును దైవంతో సమానంగా చూస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రుల తరువాత ఆ స్థానాన్ని, అంతటి గౌరవాన్ని గురువుకు ఇస్తాము. అంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఓ గురువు వెర్రి వేషాలు వేశాడు. పసి పిల్లలకు తప్పుడు పాఠాలు చెప్పాడు. కడప జిల్లాలో అసభ్య టీచర్‌ భాగోతంపై 10 టీవీ కథనం. 
బూతులు జొప్పిస్తూ..
ఇదిగో ఈ ప్రబుద్ధుడిని చూడండి. ఇతని పేరు...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 12:58

కడప : జిల్లాలోని రాజంపేట మండలం ఉప్పరపల్లెలోని రైల్వేట్రాక్‌పై యువతీ, యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి.. డ్రైవింగ్‌ లైసెన్స్ఆధారంగా చనిపోయిన యువకుడు రాజోలు నాగార్జున రెడ్డిగా గుర్తించారు.. వారిదగ్గరున్న బ్యాగ్‌లో బంగారు తాళిబొట్టు, రెండువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొనిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 

Saturday, July 15, 2017 - 15:51

కడప : జిల్లా బద్వేలు పట్టణం సిద్దివాటం రోడ్డు పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్కూళ్లు, హాస్టల్‌లకు దగ్గరలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం వల్ల తాము, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న మహిళలు... మద్యం షాపు యజమానులతో వాదనకు దిగారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే...

Thursday, July 13, 2017 - 14:56

కూలి ఇచ్చి వీపు పగులగొట్టిచ్చుకున్నట్లు ఇదే కావచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పని కూడా గట్లనే ఉన్నది. కడప జిల్లాలోని రాజంపేటలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పని చేసుకుని రాక..సమస్యలు ఉంటే చెప్పుండ్రి..చెప్పుండ్రి..నేను వినతానికే వచ్చినా..అంటే జనాలు ఏం చేసిన్రో వీడియోలో చూడండి...

Tuesday, July 11, 2017 - 16:35

కడప : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ కడప జిల్లాలో పర్యటించారు. కడప కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో 16 వేల కోట్ల లోటు బడ్డెట్‌ ఉన్నా ఆలోటు ఏర్పడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 2019లోగా అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేయిస్తామన్నారు. కాంగ్రెస్‌ పదేళ్లలో చేయని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపించామని...

Tuesday, July 11, 2017 - 07:40

హైదరాబాద్ : జీఎస్టీ చేనేత నడ్డివిరుస్తోంది. ఆకలిచావులకు చేరువలో ఉన్న నేతన్నలకు గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ గుదిబండగా మారుతోంది. చేనేత వస్త్రాలకు ఉపయోగపడే ముడిసరుకుపై పన్నువిధించడంతో  నేతవృత్తి ప్రమాదంలో పడింది.  కడపజిల్లాల్లో చేనేత అవస్థలపై టెన్‌టీవీ ఫోకస్‌.. 
చిలపనూలుపై 5శాతం జీఎస్టీ
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టే ఉంది కేంద్రంలోని పాలకుల...

Pages

Don't Miss