కడప
Friday, July 8, 2016 - 20:36

కడప : ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడప గడపకు వైసీపీ ముఖ్య ఉద్దేశమని వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ఇడుపుల గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై వంద ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ప్రతి ఇంటిలో ఇస్తామని తెలిపారు. 

 

Wednesday, July 6, 2016 - 20:45

కడప : జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ వీసీ బేతనభట్ల శ్యాంసుందర్ అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీసీఐడీని ఆదేశించారు. వీసీపై వస్తున్న ఆరోపణల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసీ అక్రమాల మీద విచారణకు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా సీఎం నిర్ణయంపై విద్యార్థి...

Monday, July 4, 2016 - 06:33

విజయవాడ : రుతుపవనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో అన్ని జిల్లాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గతంలోలాగా... ఎరువులు, విత్తనాల కోసం.. రైతులు ఇబ్బందులు పడకుండా.. ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోవాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నైరుతి సీజన్ ఆరంభంలో అధిక వర్షాలు కురుస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది....

Saturday, July 2, 2016 - 18:28

కడప : ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ అరికట్టాలని డివైఎఫ్ ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు సమాఖ్య నేతలు కడప జిల్లా వైద్యాఆరోగ్యశాఖ కార్యాలయం ముదు ధర్నా చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రుల మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ...ఆసుపత్రులంటేనే ప్రజల్లో భయం పుట్టేలా ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు....

Saturday, July 2, 2016 - 11:34

కడప : వైసీపీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి మనస్థాపం చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేసి కొరియర్, ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా స్థానికంగా టీడీపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా తమకు అవమానిస్తున్నారని కడప జిల్లాలో కొన్ని రోజుల క్రితం ఆందోళనలు జరిగిన విషయం...

Tuesday, June 28, 2016 - 16:28

క‌డ‌ప‌ : ప్రొద్దుటూరులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అక్క‌డి శ్రీ‌వాణి పాఠ‌శాల‌లో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠ‌శాల‌లోని బీరువా మీద ప‌డ‌డంతో భార్గ‌వి అనే ఎల్ కేజీ విద్యార్థిని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళన చేపట్టారు. స్కూలుపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భార్గవిపై బీరువా పడిన సమయంలో...

Monday, June 27, 2016 - 14:41

కడప : విత్తనం కొద్దీ ఫలసాయమన్నారు పెద్దలు. రైతులు మంచి పంటలు పండించాలంటే మేలిమి విత్తనాలు అవసరం. మంచి విత్తనం లభిస్తే సగం కష్టాలు తీరినట్టే...ఇవేవి తమకు పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేలిమి రకాల విత్తనాల ఉత్పత్తిపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండల పరిధిలోని యస్.ఉప్పలపాడులో వ్యవసాయ విత్తన ఉత్పత్తి ఉంది. 1960లో అప్పటి ముఖ్యమంత్రి నీలం...

Saturday, June 25, 2016 - 15:41

కడప : జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శ్యాంసుందర్‌  అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుని కోట్ల ఆర్జిస్తున్నారని స్వయంగా పాలక మండలి సభ్యులే  ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 
వివాదాస్పదంగా శ్యాంసుందర్...

Saturday, June 25, 2016 - 08:45

కడప : జిల్లాలో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రొటోకాల్ గొడవ తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంలేదని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడు పిలిచి మరీ అవమానిస్తున్నారని మండిపడుతోంది. జిల్లాలో టీడీపీ నేతలకు ఇచ్చిన గౌరవం..స్థానిక శాసనసభ్యులకు అధికారులు ఇవ్వడంలేదని ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపణలను టీడీపీ...

Thursday, June 23, 2016 - 18:52

కడప : యోగి వేమన యూనివర్సిటీ విద్యార్థులపై తేనేటీగలు దాడి చేశాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ కు హాజరయిన విద్యార్థుల మీద ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో విద్యార్థులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కడపరిమ్స్ కు తరలించారు. తేనెటీగల దాడితో కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొంది. 

 

Tuesday, June 14, 2016 - 20:44

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలపై కూడా సందేహాలు మొదలయ్యాయి. గతంలో వరుసగా జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని.. ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అనుమతులు లేని... భద్రతా ప్రమాణాలు పాటించని.. స్కూలు బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో...

Pages

Don't Miss