కడప
Friday, May 12, 2017 - 19:07

కడప : ఆరుగాలం శ్రమ పడి సాగు చేసిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాక కడప రైతాంగం అల్లాడుతుంది. జిల్లాలో మైదుకూరు నియోజక వర్గంలో పసుపును అత్యధికంగా పండిస్తారు. అయితే ఈ సారి తగిన ధర లేకపోవడంతో పసుపు నిల్వలతో గోదాములు నిండిపోయాయి. మద్దతు ధర ఇచ్చి..పసుపు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కడప ఒకటి. అయితే పసుపు ధర...

Tuesday, May 9, 2017 - 17:46

కడప : బద్వేలు టిడిపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీలోని ముగ్గురు నేతల కుమ్ములాటలతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసాధ్యం అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? ఎందుకు వారి మధ్య గొడవలు? బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయమ్మ.. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి...

Monday, May 8, 2017 - 12:19

కడప: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టిడీపి పాగా వేసింది. మున్సిపల్ ఛైర్మన్ రఘురామరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. అయితే వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.

Sunday, May 7, 2017 - 19:09

కడప : జిల్లా మైదుకూరు మండలం ఒనిపెంటంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు.. పొలం పనులకు వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో బ్రహ్మంగారి మఠం నుంచి మైదుకూరు వస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రమాదం గురించి ఆరాతీశారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు తరలించి చికిత్స...

Sunday, May 7, 2017 - 15:09

కడప : రాయలసీమలో ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు పోరు బాట పట్టనున్నాయి. ఈనెల 16, 17 తేదీల్లో అనంతపురం కలెక్టరేట్ ఎదుట 48 గంటలపాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.నారాయణ, జి.ఓబులేసులు ప్రకటించారు. ఈ దీక్షలకు సీమ వ్యాప్తంగా ఉన్న రైతులు తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

 

Sunday, May 7, 2017 - 13:57

కడప : జిల్లాలో ప్రేమ జంటపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కడప నగరం ఆకుల వీధికి చెందిన ఓ బాలిక, అశోక్‌ నగర్‌కు చెందిన ఓ బాలుడు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అబ్బాయి తండ్రి, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో పోలీసులు వెంటనే ప్రేమజంటను స్టేషన్‌కు పిలిపించారు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ...

Saturday, April 29, 2017 - 18:59

కడప : జిల్లాలో వైసీపీ పట్టుసడలుతోందా? ఒకప్పుడు ప్రత్యర్థులకు సవాల్‌గా ఉండే ప్రాంతం.. ఇప్పుడు రెడ్‌ కార్పెట్‌ పరుస్తోందా? కడపలో ఏం జరుగుతుంది? వైసీపీ ప్రాబల్యం కోల్పోతుందా? ప్రస్తుతం వైసీపీ శ్రేణులలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి.
వైసీపీకి ఎదురుదెబ్బ
వైసీపీ అధినేత జగన్‌  కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ప్రత్యర్థులకు పట్టు దొరకని ప్రాంతం. వైఎస్ రాజారెడ్డి...

Wednesday, April 26, 2017 - 18:52

కడప : జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. ఖాజీపేట నుండి తిరుపతి వెళ్తున్న ఇంటర్‌ విద్యార్థి నవీన్‌కుమార్‌రెడ్డిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలైన నవీన్‌ను ఆస్పత్రికి తరలించారు. నవీన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష రాసేందుకు నవీన్‌ తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

Thursday, April 20, 2017 - 18:42

కడప: కడప మార్కెట్ యార్డును వైసీపీ నేతలు సందర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్‌ భాష, రఘురామిరెడ్డిలు.. పసుపు రైతు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Pages

Don't Miss