కడప
Thursday, October 12, 2017 - 15:15

కడప : జిల్లాలోని బద్వేలులో సీపీఐ నాయకులు సంకెళ్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా, వంశధార భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని సీపీఐ, సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. నిరసన తెలుపుతోన్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధుని అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బద్వేలు సీపీఐ నాయకులు.. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

 

Wednesday, October 11, 2017 - 09:26

కడప : జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మార్వో కార్యాలయం అవినీతి అడ్డాగా మారింది. ఓ రాజకీయ నేత కుమారుడు ప్రధాన రహదారి పక్కన ఉన్న రైతుల భూమిని కబ్జా చేశాడు. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై 35 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. దీంతో రైతులు కబ్జా దారుడి నుంచి తమ భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Tuesday, October 10, 2017 - 19:24

కడప : కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ విమర్శించారు. కడప నగరంలో మూడు రోజుల పాటు జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర సమావేశాలకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యలను...

Tuesday, October 10, 2017 - 12:11

కడప : జిల్లా కొండాపురం మండలంలో పెన్నానది పోటెత్తిడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండికోట ప్రాజెక్టు 4టీఎంసీల నీరు చేరుకుంది. ముద్దనూరు మండలం కోసినేపల్లి వాగలో పడిన వ్యక్తి పోలీసులు రక్షించారు. పూర్తి వివరాలకు వీడయో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 15:47

కడప : వర్షాలు సమృద్దిగా కురవడంతో రాయలసీమలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సారి కురిసిన వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు...

Friday, October 6, 2017 - 10:31

కడప : నగరంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్‌ హాస్టల్‌లో ఉరేసుకుని పావని ఆత్మహత్య చేసుకుంది. అయితే... పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పావని ఆత్మహత్య చేసుకున్న రూమ్‌ను పరిశీలించేందుకు బంధువులు వెళ్తుండగా బంధువులు అడ్డుకున్నారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Friday, October 6, 2017 - 10:13

కడప : పట్టణంలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గర్ల్‌ హాస్టల్‌లో ఉరేసుకుని పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే పావని ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Tuesday, October 3, 2017 - 19:10

 

కడప : అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావుకు బద్వేల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 6వేల జరిమానా కూడా విధించింది. పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూముల వ్యవహారంలో కోర్టు పై తీర్పును వెలురించింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Sunday, October 1, 2017 - 16:43

కడప: ఏపీ సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ఈనెల 10 నుంచి 12 వ తేదీ వరకు కడపలో జరుగనున్నాయి. వీటిని విజయవంతం చేసే అంశంపై చర్చించేందుకు కడప జిల్లా సిఐటియు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. డిసెంబర్‌లో నిర్వహించే చలో అసెంబ్లీ...

Pages

Don't Miss