కడప
Monday, July 13, 2015 - 20:25

కడప: గ్రామంలో మద్యం దుకాణాన్ని ఎత్తేయ్యాలని కోరుతూ మహిళలు ఏకంగా మద్యం షాపునే ధ్వంసం చేశారు. ఈ ఘటన కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వైన్‌ షాపును మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని గత పదిహేను రోజులుగా ధర్నా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. నివాసం ఉంటున్న ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటు చేయడం పట్ల...

Friday, July 10, 2015 - 17:35

కడప: జిల్లాలో యువతుల ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టైంది. మాయమాటలతో మైనర్ బాలికలను వ్యభిచారంలోకి దించేందుకు తీసుకెళ్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 25మంది యువతులను కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ లో తరలిస్తుండగా... రక్షించారు. రైల్వే స్టేషన్ కు వచ్చిన ఓ మహిళా మండలి అధ్యక్షురాలు వారిని చూసి విచారించారు. అమ్మాయిలు పొంతనలేని సమాధానాలు చెప్పండంతో... అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు...

Tuesday, July 7, 2015 - 20:39

కడప : జిల్లాలో నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్ కె.వి.రమణ విచారణ చేపట్టారు. జడ్పీలో 13వ ఆర్థిక సంఘ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, జనరల్ ఫండ్స్ లను వైసిపి ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపీలు ఇష్టారాజ్యంగా పంచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్‌ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వైసిపి ప్రజా ప్రతినిధులకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కూడా కలెక్టర్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం....

Monday, July 6, 2015 - 20:50

కడప : జిల్లాలో ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ మోహం చాటేయడంతో బాధితురాలు కడప జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగింది. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం దాసరి పల్లెకు చెందిన దళిత యువతి అదే గ్రామంలోని చిత్తా శౌరిరెడ్డి మెమోరియల్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో మేనేజర్‌గా...

Monday, July 6, 2015 - 16:42

కడప : ఆసుపత్రిలో ఉన్న వారిని చూద్దామని వెళ్లిన బంధువులు ఆసుపత్రి పాలయ్యారు. నగరంలోని హిమాలయ మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ రోప్ తెగిపడడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. లిఫ్ట్ మూడో అంతస్తుకు వెళ్లగానే రోప్ ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీనితో వేగంగా లిఫ్ట్ కిందకు పడిపోయింది. ఆ సమయంలో అందులో 13 మంది ఉన్నారు. ఎనిమిది మందికి నడుం..చేతులు..కాళ్లకు...

Sunday, July 5, 2015 - 08:20

కడప : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తెగిపడిన విద్యుత్ వైర్లు ఓ రైతుపై పడిపోయాయి. దీనితో ఆ రైతు అక్కడికక్కడనే సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే...ఆదివారం తెల్లవారుజామున అరటికాయల లోడ్ తో టాటా ఏసీ వాహనం బద్వేల్ నుండి నెల్లూరుకు వెళుతోంది. పీపీ కుంట సమీపంలోకి రాగానే వేగంగా వెళుతున్న ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొటింది. దీనితో విద్యుత్ స్తంభం...

Saturday, July 4, 2015 - 15:49

కడప: జిల్లా జెడ్ పి సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. అధికార పార్టీ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఒకరిని మించి మరొకరు మైకులు పగులగొట్టి వీరంగం సృష్టించారు. సమావేశంలో కలెక్టర్‌ రమణ-వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పర్యటన సమాచారం జిల్లా కలెక్టర్‌ తమకు ఇవ్వడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. జెడ్పీ ఛైర్మన్‌ గూడూరు రవి...

Saturday, July 4, 2015 - 13:35

కడప : సమస్యలు తీరుస్తారని ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు మాత్రం సమస్యలను ప్రస్తావించకుండా ఆధిపత్య పోరుకు తెరతీస్తున్నారు. జడ్పీ సమావేశంలో ఈ సారైనా తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్న జిల్లా వాసులకు రిక్తహస్తమే ఎదురవుతోంది. శనివారం నాడు జరిగిన సమావేశం చూస్తే తెలుస్తోంది. సమావేశంలో ఒకరు మైక్ విరగొడితే తామేం తక్కువ తినలేదని అధికార పక్షానికి చెందిన వారు కూడా మైక్ ను విరగ్గొట్టారు.
...

Pages

Don't Miss