కడప
Friday, February 19, 2016 - 18:43

హైదరాబాద్ : ఒకప్పటి రతనాల సీమ. నేడు కరువు, కాటకాలతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. దశాబ్దాలుగా ప్రభుత్వాల చేత దగాపడ్డ రాయలసీమ అభివృద్ధి గొంతుకను వినిపించేందుకు, సీమ కష్టాలు ఏకరువు పెట్టేందుకు వామపక్షాలు నడుంబిగించాయి. సీమలో పీడిత ప్రజలకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తున్నాయి. సీమ సమస్యలు హస్తినకు వినిపించేలా బస్సు యాత్రకు శ్రీకారం...

Friday, February 19, 2016 - 13:52

కడప : ఆరు గాలం కష్టపడ్డా అప్పులు తీరక రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు.. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట ఎగువపల్లెలో జయరామయ్యకు 40 సెంట్ల భూమి ఉంది.. మరికొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.. ఈ సాగుకోసం దాదాపు 7లక్షల రూపాయలు అప్పు చేశాడు.. పంట పండక ఆర్థికంగా చితికిపోయాడు.. బతుకుతెరువుకోసం భార్యను కువైట్ పంపాడు.. ఆమె పంపిన డబ్బు వడ్డీలకే సరిపోలేదు......

Friday, February 19, 2016 - 06:23

చిత్తూరు : అది ఒకప్పుడు రతనాల సీమ. అభివృద్ధిలో అన్నిటికన్నా ముందుండే మహత్తర సీమ. నేడదే ప్రాంతం... కరువు, కక్షలు కార్పణ్యాలు, అన్నిటికి మించి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వాల చేత దగాపడ్డ ఆ ప్రాంత అభివృద్ధికి కరువు సీమ కష్టాలు ఏకరువు పెట్టేందుకు వామపక్షాలు నడుంబిగించాయి. ఆకలేస్తే నేల వైపు దాహమేస్తే ఆకాశంవైపు చూసే అభాగ్యులకు...

Friday, February 19, 2016 - 06:20

హైదరాబాద్ : హోరాహోరీగా సాగిన ఎపీఎస్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్వల్ప ఆధిక్యత సాధించింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌పై ఎన్ఎంయూ కేవలం 173 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎన్ఎంయూకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్లు వెయ్యికిపైగా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా పోలింగ్‌ రోజు దూరప్రాంతాలకు...

Thursday, February 18, 2016 - 18:43

కడప : జిల్లా జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ వర్గంలో ముసలం మొదలైంది. ఆదినారాయణరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తాజాగా నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానన్నారు....

Monday, February 15, 2016 - 21:24

హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ శ్రేణుల దాడిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడిని నిరసిస్తూ విజయవాడలో...

Sunday, February 14, 2016 - 21:31

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులపెట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యలను తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ అనుబంధ సంఘ్‌పరివార్‌ శ్రేణులు మరోసారి తమ అసహనాన్ని బయటపెట్టాయి. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. సంఘ్‌పరివార్‌ దాడికి నిరసనగా దేశ...

Wednesday, February 10, 2016 - 15:38

కడప : వేలమైళ్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి తరలివచ్చిన కొంగలు కడప జిల్లా గోపవరం మండలంలోని బేతాయపల్లె, బెడుసుపల్లె గ్రామాల్లో విడిది చేస్తున్నాయి. ఈ ఎర్రకాళ్ల సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల్లో సందడి నెలకొంది.

శీతాకాలంలో సైబీరియా నుంచి ...

Wednesday, February 10, 2016 - 11:10

కడప : జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బిల్లుపాటిపల్లి వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే దుంగలను పట్టుకున్నారు. వాహనాన్ని వదిలి స్మగ్లర్లు పరారయ్యారు.

Sunday, February 7, 2016 - 19:45

కడప : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోముగ్గురు మృతి చెందారు. సుండుపల్లి మండలం రాచమోళ్ల పల్లి సమీపంలో రెండు ఆటోలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Sunday, February 7, 2016 - 16:51

కడప : కరువు పరిస్థితులు, అప్పులు ఏపీలో ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమంటూ రాసిన లేఖ మృతుని జేబులో దొరికింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా బోర్లలో నీరు పడకపోవడం, వ్యవసాయానికి తీసుకున్న రుణాలను చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేయడం పైగా...

Pages

Don't Miss