కడప
Monday, January 1, 2018 - 09:01

కడప : జిల్లాలో కొత్త సంవత్సరంలో విషాదం నెలకొంది. పెండ్లిమర్రిలోని ఇందిరానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చలిమంట దగ్గర కూర్చున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తోసహా ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. మృతులు లక్ష్మీనరసింహ్మా, కార్తీక్, గిరి, భాస్కర్ లుగా గుర్తించారు.  పులివెందుల నుంచి వస్తుండగా ఈ...

Thursday, December 28, 2017 - 11:54

కడప : హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కడప జిల్లా చాపాడు ఎస్సై శివశంకర్‌ చితకబాదారు. మైదుకూరుకు చెందిన మాచనూరు సుధీర్‌ బైక్‌పై ప్రొద్దుటూరు వెళ్తుండగా.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న చాపాడు పోలీసులు ఆపారు. హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించగా.. ఇంట్లో మరిచిపోయానని చలానా వేయమన్నందుకు ఎస్సై శివశంకర్‌ శివాలెత్తిపోయారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని స్థానిక...

Tuesday, December 26, 2017 - 16:14

కడప : జంబలకిడి పంబ సిన్మా సీన్‌ కడప జిల్లాలో రిపీట్‌ అయ్యింది. ఆ సిన్మాలో ఆడాళ్లు మగళ్లాలా.. మగవాళ్లు ఆడవాళ్లలా ప్రవర్తిస్తారు. అదే తరహాలో ఓ కిలాడీ లేడీ మగవేషంలో ముగ్గురు యువతులను పెళ్లాడింది. కడప జిల్లా కాశినాయన మండలం ఇటికలపాడు గ్రామానకి చెందిన రమాదేవి.. తమిళనాడు రోహిణి మిల్లో ఉద్యోగం చేస్తోంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంది....

Tuesday, December 26, 2017 - 10:21

కడప : జిల్లా పులివెందులలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నల్లపురెడ్డిపల్లె బీసీ హాస్టర్ వార్డెన్ రాజకుళ్లాయప్ప ఇంటిలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్జీవో నాయకుడు జగన్నాథరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఏడు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Saturday, December 23, 2017 - 13:31

కడప : అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తమ విషయం ఎక్కడ తెలుస్తోందనని ఒకరు..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కొంతమంది భార్యలు కర్కశంగా మారుతున్నారు. దారుణంగా భర్తలను హత్య చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ సినీ ఫక్కీలో భర్తను ప్రియుడితో కలిసి స్వాతి హత్య చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా కడపలో మరో ఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో...

Friday, December 22, 2017 - 06:31

కడప : ఉక్కు కర్మాగార ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్రమంత్రి బీరేందర్‌సింగ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 27న క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ - డీవైఎఫ్‌ఐ వరుస ఆందోళనలతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కదిలింది.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఎస్‌...

Pages

Don't Miss