కడప
Monday, May 14, 2018 - 06:39

విజయవాడ : ఉప‌రితల ఆవ‌ర్తనం ప్రభావంతో కురుసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఉరుములు పిడుగుల‌తో కూడిన వ‌ర్షానికి పలుప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. పిడుగు పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మ‌రో రెండు రోజుల పాటు ఉప‌రిత ఆవ‌ర్తన ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు ప్రకటించారు. దీంతో ఉత్తరాంధ్రాలోని ప‌లు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Wednesday, May 9, 2018 - 19:22

కడప : జిల్లాలోని లింగాల మండలం ఎగువపల్లెలో దారుణం జరిగింది. పొలంవద్దకు వెళ్లిన వ్యక్తిని దుండగులు అతి దారుణంగా కొట్టి చంపారు. అనంతపురం జిల్లాతాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామానికి చెందిన శివలీల, అదే గ్రామానికిచెందిన సాయిభూషన్ రెడ్డికి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే సాయిభూషన్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి...

Saturday, May 5, 2018 - 18:14

కడప : అభిమానుల ప్రేమాభిమానాలే తనకు ఆశీస్సులని ప్రముఖ సినీనటి తమన్నా అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేశారు. ఓ మొబైల్‌ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమన్నా విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు తాను మొదటిసారిగా వచ్చానని.. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు....

Tuesday, May 1, 2018 - 13:34

కడప : జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేసి కర్మికులు ఐక్యతను చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వివక్షను చూపుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. 

Sunday, April 29, 2018 - 19:36

కడప : జిల్లాలోని పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. వ్యాను, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా గుర్తించారు.  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

Sunday, April 29, 2018 - 13:41

కడప : కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. దీక్షను విజయంతం చేయాలంటూ కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నుంచి మొదలైన ఈ ర్యాలీ.. ముద్దనూరు మీదుగా యర్రగంట్ల వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Friday, April 20, 2018 - 21:07

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కదిలాయి. జిల్లాకేంద్రాలు, నియోజకవర్గాలు, పట్టణాల్లో దీక్షలు చేపట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా,...

Monday, April 16, 2018 - 17:34

కడప : రాష్ర్టానికి ప్రత్యేక హోదా కోరుతూ అఖిలపక్షం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కడప జిల్లాలో ప్రశాతంగా కొనసాగుతోంది.  ఉదయం 4 గంటల నుండి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి అప్సర సర్కిల్, కృష్ణా సర్కిల్ మీదుగా వామపక్ష నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Monday, April 16, 2018 - 06:44

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధనకోసం చేపడుతున్న బంద్‌కు మద్ధతుగా నెల్లూరులో సీపీఎం, సీపీఐ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలనుంచే.. ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు బస్సులను నిలిపేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఎక్కడి బస్సులను అక్కడే అడ్డుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌ కొనసాగుతోంది....

Pages

Don't Miss