కరీంనగర్
Wednesday, November 22, 2017 - 16:06
Wednesday, November 22, 2017 - 14:51

కరీంనగర్/జగిత్యాల : జిల్లా కోరుట్ల కోర్టుకు కంచ ఐలయ్య హాజరయ్యారు. కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జ్‌లతో వైశ్యులు నిరసన తెలిపారు. కంచ ఐలయ్య కోరుట్ల కోర్టులో హాజరయ్యేందుకు వెళ్తుండగా... వైశ్యులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల బందోబస్తుతో ఐలయ్య కోరుట్ల కోర్టుకు చేరుకున్నారు. 

Tuesday, November 21, 2017 - 09:37

కరీంనగర్‌ : జిల్లాలో విషాదం నెలకొంది. బంధువులకు పెళ్లి పత్రికలు పంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రవీందర్ రావు, సరిత దంపతులు.. తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు బంధువులకు పంచేందుకు హైదరాబాద్ కు వెళ్లారు. పెళ్లి పత్రికలు బంధువులకు పంచిన తర్వాత తెల్లవారుజామున కారులో రామగుండంకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో...

Sunday, November 19, 2017 - 18:06

కరీంనగర్/సిద్దిపేట : జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌..మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇందిరాగాంధీ జయంతి రోజున...వరల్డ్‌ టాయిలెట్‌ డే అంటూ ప్రచార ప్రకటనలు చేయడం దారుణమన్నారు.

 

Sunday, November 19, 2017 - 18:04

కరీంనగర్ : శివారు మల్కపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యవసాయ కూలీల కుటుంబాలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ TRS ఎంపీ వినోద్‌కుమార్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాల స్వగ్రామం చామనపల్లి వెళ్లి దుఖఃసాగరలో మునిగిన మృతుల పిల్లలను ఓదార్చారు. తల్లులను పోగొట్టుకున్న పిల్లల రోధనలను చూసి చలించిపోయిన ఈటల రాజేందర్‌ కన్నీటిపర్యంతం అయ్యారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల...

Sunday, November 19, 2017 - 16:39
Sunday, November 19, 2017 - 14:31

కరీంనగర్ /వరంగల్ : జిల్లా కమలాపూర్ గ్రామంలో వదినా, మరిదిని వారి బంధువులు చితకబాదారు. 2 నెలల క్రితం అన్నభార్య లావణ్యను తీసుకుని తమ్ముడు తిరుపతి వెళ్లిపోయాడు. వారు ఈ రోజు గ్రామానికి చేరుకుకోవడంతో కోపొద్రిక్తులైన బంధువులు వారి దాడికి దిగి హత్య చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, November 18, 2017 - 14:05

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తా దగ్గర ఉన్న తాత్కాలిక చిరు వ్యాపారాల షెడ్లను రామగుండం నగరపాలక సంస్థ తొలగించింది. మున్సిపల్ భవన నిర్మాణానికి అడ్డుగా ఉన్న తోపుడు బండ్ల నిర్మాణాల విషయంలో.. గత రెండు రోజుల క్రితం నగర పాలక అధికారులు చిరు వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. రహదారిని అక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...

Saturday, November 18, 2017 - 07:03

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌‌లో ప్రయాణికుడికి ఆర్టీసీ కండక్టర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనతో పాటు తన పెంపుడు జంతువుకి కూడా టికెట్‌ తీసుకుంటానని బస్సులో అనుమతించాలని కోరగా కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న మరో కండక్టర్‌ శంకర్‌ను ఆర్టీసీ కంట్రోల్...

Pages

Don't Miss