కరీంనగర్
Friday, September 22, 2017 - 17:34

కరీంనగర్/జగిత్యాల : కోతుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఓ యువరైతు వినూత్న ప్రయత్నం చేశాడు. కోతులను పారదోలేందుకు కుక్కను పంటపొలంలో కట్టేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి...తనకు ఉన్న3 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసాడు. అయితే రోజూ కోతుల గుంపు కంకులు తినడంతో పంటను నాశనం చేసేవి. నెలకు వెయ్యి రూపాయల...

Friday, September 22, 2017 - 17:07

కరీంనగర్ : జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగం పనుల్లో మళ్లీ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద సొరంగం పనులు చేపడుతుండగా బండరాళ్లు విరిగిపడడంతో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలకు కారణం యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోబడమే అని నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, September 22, 2017 - 13:37

కరీంనగర్ : సింగరేణి సంస్థలో ఆరవ విడత జరగనున్న ఎన్నికలకు నల్లబంగారు నేల సిద్ధమవుతోంది. విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలే కార్మిక సంఘాల భవిష్యత్‌ను తేల్చనున్నాయి. నల్ల సూరీల నేలపై మోగిన ఎన్నికల సైరన్‌పై 10టీవీ ప్రత్యేక కథనం. 
ర‌స‌వ‌త్తరంగా బొగ్గు రాజ‌కీయం 
కరీంనగర్‌ జిల్లాల్లో బొగ్గు రాజ‌కీయం ర‌స‌...

Wednesday, September 20, 2017 - 21:48

కరీంనగర్/సిరిసిల్ల : రోజులాగే కార్మికులు పనిలోకి వెళ్లారు.. భోజన విరామం కోసం ముందు ఇంజనీర్లు బయటకు వచ్చారు.. వారి వెనకే వస్తున్న కార్మికులపై సొరంగ మార్గం కూలిపోయింది.. కాళేశ్వరం పనుల్లో జరిగిన ఈ ప్రమాదం ఏడుగురు కార్మికుల ప్రాణాలను బలిగొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో కాళేశ్వరం ఎత్తిపోతల పదో ప్యాకేజీ...

Wednesday, September 20, 2017 - 19:10

కరీంనగర్/సిరిసిల్ల : కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య చేరింది. యాజమాన్యం నిర్లాక్ష్యం కారణంగా సొరంగం కూలిందని తెలుస్తోంది. సొరంగంలో మరికొందురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Wednesday, September 20, 2017 - 18:13

కరీంనగర్ : కుటుంబసభ్యులతో నడిచి వస్తున్న ఈ బామ్మ పేరు అనుమవ్వ. కరీంనగర్ జిల్లా వెలిచాలకి చెందిన అనుమవ్వ ఇటీవల 110వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి ఆమె పుట్టినరోజును వేడుకగా జరిపారు. 60 ఏళ్లు బతకడమే అరుదుగా మారిన ఈరోజుల్లో 110 ఏట అడుగుపెట్టిన అనుమవ్వ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామీణ వాతావరణంలో జీవనం, అంబలితో పాటు కూరగాయలతో భోజనం అనుమవ్వ ఆరోగ్యంగా...

Wednesday, September 20, 2017 - 16:30

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద కాళేశ్వరం సొరంగ మార్గం కూలి ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సొరంగంలో మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Wednesday, September 20, 2017 - 09:39

పెద్దపల్లి : సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకొంటోంది. ఆరో విడత ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. దీనితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరపున ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ఆర్జీ1 గని గేట్ వద్ద వారు మీటింగ్ నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ ను ఇతర కార్మిక సంఘానికి చెందిన సింగరేణి కార్మికులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Tuesday, September 19, 2017 - 17:44

కరీంనగర్ : అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో..కరీంనగర్ జిల్లాలో సిఐటియు నాయకులు ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. కళాభారతి నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. కాలపరిమితి ముగిసినా కనీస వేతన చట్టాలను అమలు చేయకపోవడం పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి...

Pages

Don't Miss