కరీంనగర్
Wednesday, July 22, 2015 - 12:19

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. పుష్కరాలకు వెళ్తున్న భక్తులు కరీంనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ వద్ద తుఫాన్‌ వాహనం చెట్టును బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక...

Tuesday, July 21, 2015 - 18:25

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రిపై మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ దళిత వ్యతిరేకంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూపిస్తోందని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కకపోవడం విడ్డూరమన్నారు.

Tuesday, July 21, 2015 - 17:56

కరీంనగర్ : జగిత్యాలలో విషాదం నెలకొంది. పెర్కపల్లెకి చెందిన యువ రైతు రవి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పొలంలోకి వెళ్లిన రవి... మోటార్‌ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మరణించాడు. దీంతో మృతుడి కుటుంబం కన్నీరు మున్నీరైంది.

 

Monday, July 20, 2015 - 13:32

విజయనగరం: జిల్లా కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసాడు. ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ మూలకు రైతు స్పృహ తప్పి పడి ఉండటాన్నిఅధికారులు గమనించారు. తీరా చూస్తే నోటి వెంట నురుగులు కక్కుతున్నాడు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రైతు దగ్గరున్న వివరాల ప్రకారం బాధితుడు ఉత్తరావల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే ఆత్మహత్యాయత్నానికి...

Sunday, July 19, 2015 - 20:43

కరీంనగర్‌: జిల్లాలోని గోదావరిఖని పుష్కరఘాట్‌లో ఓ అఘోర పుష్కర స్నానమాచరించారు. హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌ ఎనిదేళ్ల క్రితం కాశీకి వెళ్లి అఘోరాగా మారాడు. గోదావరిలో స్నానం చేసేందుకు.. ఆయన గోదావరిఖనికి రాగా.. స్థానిక మహదేవ భక్తసమాజం ఘనంగా స్వాగతం పలికింది. పుణ్య స్నానం అనంతరం పుష్కర ప్రాముఖ్యతను అరవింద్‌ చెప్పారు.

 

Sunday, July 19, 2015 - 20:37

కరీంనగర్: మంథనిలో గోదావరి నిత్య హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడితో పుష్కర ఘాట్‌...జనసంద్రాన్ని తలపించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు గోదావరికి హారతినిచ్చారు. నాగసాధువులు...గోదావరి మాత రూపానికి ప్రత్యేక పూజలు చేశారు.

Sunday, July 19, 2015 - 18:13

కరీంనగర్: తెలంగాణ పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించారని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ టీసర్కార్ ను ప్రశంసించారు. కాళేశ్వరంలో ఆయన పుష్కరస్నానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో కాళేశ్వరానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అందుకే ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చినట్టు లగడపాటి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కర ప్రాంతాల్లో పోటెత్తుతున్న...

Sunday, July 19, 2015 - 15:42

కరీంనగర్‌: జిల్లాలో రాయికల్‌ మండలం ఒడ్డె లింగాపూర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. చిన్నారులపై కిరాతకంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Sunday, July 19, 2015 - 10:20

కరీంనగర్ : గోదావరి పుష్కరాలకు తరలివెళ్లే యాత్రీకులతో కాళేశ్వరం కోలహాలంగా మారింది. భారీగా యాత్రీకులు తరలివస్తుండడంతో గోదావరి తీరం అంతా సందడిగా మారింది. యాత్రికుల వాహనాలతో రహదారులన్నీ రద్దీగా ఉన్నాయి. హైదరాబాద్ నుండి యాత్రికులు పుష్కరస్నానమాచరించేందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు వెళుతున్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలోని మహదేవ్ పూర్ నుండి కాళేశ్వరం...

Sunday, July 19, 2015 - 08:18

కరీంనగర్ : ఇసుకేస్తే రాలనంత..అడుగు తీసి అడుగు వేయలేనంత..దారులెంట జనం..తీరమెంట జనం..ఘాట్ల నిండా జనం..ఎటు చూసినా జనమే జనం..రోడ్లన్నీ వాహనమయం..వరుస సెలవుల ప్రభావంతో ధర్మపురిని జన కెరటం ముంచెత్తింది..శనివారం ఎలాంటి రద్దీ నెలకొందే అదే పరిస్థితి ఆదివారం కూడా నెలకొంది. తెల్లవారుజామునే స్నానాలు మొదలయ్యాయి. మూడు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
శనివారం 26 లక్షలకు...

Sunday, July 19, 2015 - 06:26

హైదరాబాద్ : గోదావరి ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు.. భక్తకోటి క్యూ కట్టింది. వరుస సెలవులు రావడంతో.. తెలుగు రాష్ట్రాల రహదారులు గోదావరి వైపు మళ్లాయి. ఏ రోడ్డు చూసినా భయంకరమైన ట్రాఫిక్‌ కనిపిస్తోంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వాహనాలు గోదారమ్మ వైపే మళ్లడంతో రహదారులు స్తంభించాయి. దీంతో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర...

Pages

Don't Miss