కరీంనగర్
Tuesday, May 8, 2018 - 13:36

జగిత్యాల : మల్లాపూర్ (మం) కుస్థాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులపైకి మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దీనితో ముత్తమ్మ (50), పోషాని (45), రాజు (55) మృతి చెందిన వారిలో ఉన్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 32 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పనులు చేస్తున్న స్థలం...

Tuesday, May 8, 2018 - 13:32

కరీంనగర్ : ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డిపై మరో కార్పొరేటర్ పోరుబాట పట్టింది. తన కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ ఏకంగా నిరహార దీక్షకు పూనుకోవడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ జిల్లా 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలత జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహర దీక్ష చేపట్టారు. తన భర్త మెండె చంద్రశేఖర్ పై ఎమ్మెల్యే కమలాకర్ కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా తన...

Monday, May 7, 2018 - 18:36

పెద్దపల్లి : జిల్లా మంథనిలో శివాలయం వేదికగా టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మిచెరువు ఆధునీకరణలో భాగంగా.. కట్టపై ఉన్న పురాతనమైన శివలింగం, నంది విగ్రహాలను తొలగించి మట్టిపోయడంతో వివాదం తలెత్తింది. అయితే ఈ పనిని ఎమ్మెల్యే పుట్టా మధు దగ్గర ఉండి చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోనేత సునీల్‌రెడ్డి ఆ విగ్రహాలపై మట్టిని తొలగించి పాలాభిషేకం...

Monday, May 7, 2018 - 07:59

హైదరాబాద్ : రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీనిని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌కు  రైతుల మద్దతు కూడగట్టేలా ఈ పథకం పనిచేస్తుందన్న అంచనాతో అధికార పార్టీ నేతలున్నారు. వచ్చే ఎన్నికల్లో...

Sunday, May 6, 2018 - 18:39

కరీంనగర్ : జిల్లాలో హుజురాబాద్ లో ఈనెల పదో తేదీన జరిగే రైతు బందు చెక్కుల పంపిణీ చేసే సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి ఈటెల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...9వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లాకు చేరుకుని పదో తేదీన ఉదయం 11గంటలకు సభకు హాజరౌతారని తెలిపారు. సభకు లక్ష మంది హాజరౌతారని అంచనా వేస్తున్నట్లు, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు...

Sunday, May 6, 2018 - 16:46

మంచిర్యాల : ఆమె స్వప్నాన్ని ఆర్థిక సమస్యలు చిదిమేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన కిక్‌బాక్సర్‌.. మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించే క్రమంలో ఆర్థిక సమస్యతో తల్లడిల్లుతోంది. రష్యాలో జరిగే అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ధనం కోసం అభ్యర్థిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన కందుల...

Saturday, May 5, 2018 - 08:52

కరీంనగర్ : జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని హోల్‌సేల్‌ పండ్ల దుకాణాలు, రెస్టారెంట్లపై దాడులు చేశారు. చైనాకు చెందిన ఆర్గానిక్ కెమికల్స్ సాయంతో పండ్లను మగ్గబెడుతున్నట్లు గుర్తించిన అధికారులు పలు దుకాణాలను సీజ్ చేశారు.  దాంతోపాటు ముకరపురలో నూతనంగా వెలిసిన క్లాసిక్ రెస్టారెంట్‌లోనూ సోదాలు చేశారు. కుళ్లిపోయిన మాంసం నిల్వలను అధికారులు గుర్తించి...

Wednesday, May 2, 2018 - 18:48

కరీంనగర్ : మంధనిలో ఓ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కాకతీయ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. మంథనిలోని తమ్మిచెరువు కట్ట ఆధునీకరణ పనులను కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. చెరువు కట్టపైనున్న అతి ప్రాచీనమైన శివలింగాన్ని..మహానంది విగ్రహాన్ని తొలగించడంతో కలకలం రేగింది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని, ఎనిమిది...

Thursday, April 26, 2018 - 07:31

కరీంనగర్‌ : జిల్లాలో భానుడు భగభగ లాడుతూ.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రధాన జలవనరులైన ఎల్లంపల్లి, లోయర్‌ మానేర్‌లో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో భవిష్యత్‌పై ఆందోళన కలిగిస్తుంది. ఇక సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో కార్మకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

...

Pages

Don't Miss