కరీంనగర్
Tuesday, November 7, 2017 - 16:12

కరీంనగర్ : కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న అన్నదాతకు కల్పతరువుగా మారింది. 60వసంతాల ప్రస్థానంలో సహకార విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 14 గ్రామాల రైతుల ఇళ్లలో సంతోషం నింపింది. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ముల్కనూరు గ్రామీణ సహకరా బ్యాంకుపై టెన్‌టీవీ ఫోకస్‌....
60 వసంతాల ముల్కనూర్‌ గ్రామీణ సహకార బ్యాంకు 
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భీమదేవర పల్లి...

Tuesday, November 7, 2017 - 15:49

కరీంనగర్‌ : అక్టోబర్‌ విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా...కరీంనగర్‌ జిల్లాలో సిపిఎం పార్టీ కార్యాలయంలో విప్లవ జెండాను ఆవిష్కరించారు ఆపార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎర్ర జెండాను ఎగురవేసి సోషలిస్టు ప్రజా ఉద్యమాలను గుర్తుకు చేసుకున్నారు. దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సోషలిస్టు...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Saturday, November 4, 2017 - 19:30

జగిత్యాల : జిల్లాలో ఓ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఓ బాలుడిని కాపాడబోయిన ఓ వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. తనకళ్లెదుటే తన భర్త నీట మునిగిపోతుండడంతో నీటిలోకి దిగిన ఈమెను మరో వ్యక్తి కాపాడాడు. ఈ విషాద ఘటన కోరుట్లలో చోటు చేసుకుంది. ఐలాపూర్ గ్రామం నుండి వీరకుమార్..జ్యోతి దంపతులు కోరుట్లకు వెళుతున్నారు. కోరుట్ల రైల్వే ట్రాక్ వద్ద ఏర్పడిన నీటి కుంటలో ఓ బాలుడు పడిపోయి ఉండడం వీర కుమార్...

Wednesday, November 1, 2017 - 18:54

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలుగుదేశం నేతలు రేవంత్‌రెడ్డి బాటలో నడుస్తున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్‌ బై చెప్పి.. కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొంటున్నారు. ఈ పరిస్థితి కొత్త కుమ్ములాటలకు దారి తీస్తోంది. టీడీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరికతో మొదటిగా చిక్కుల్లో పడిన నేత మానకొండూర్‌ మాజీ...

Wednesday, November 1, 2017 - 16:20
Tuesday, October 31, 2017 - 17:42

సిరిసిల్ల : జిల్లా తాడూరులోని మానేరు నది ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడూర్ గ్రామస్తులకు, స్థానిక ఇసుక రీచ్ వద్ద విధులు నిర్వర్తించే VROకు మధ్య తోపులాట జరిగింది. స్థానిక అవసరాల కోసం సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు నది నుండి ఇసుక తీసుకొనేందుకు.... ట్రాక్టర్ యజమానులకు అనుమతినిచ్చారు. అయితే ట్రాక్టర్లతో గ్రామంలో త్రాగు, సాగు నీటి పైపులైన్లు పగిలిపోతున్నాయని గ్రామస్థులు...

Pages

Don't Miss