కరీంనగర్
Sunday, January 21, 2018 - 18:41

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తన స్ధాయికి దిగజారి కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఎంతవరకూ సమంజసమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈమేరకు ఆయనతో 10 టివితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. కేసీఆర్‌ను పొగడుతూ భజన చేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ తెలంగాణలో ఒక టూరిస్టుగా పర్యటించవచ్చని.. పొలిటీషయిన్‌గా వస్తే ఊరుకోమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఏ మాత్రం స్పందించని...

Sunday, January 21, 2018 - 16:24

కరీంనగర్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోకుండా ప్రాజెక్టును ప్రశంసించిన గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌.. టీఆర్‌ఎస్‌కు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల పట్ల నరసింహన్‌కి  ఆసక్తి ఉంటే టీఆర్‌ఎస్‌లో చేరొచ్చని జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

Sunday, January 21, 2018 - 10:23

పెద్దపల్లి : జిల్లాలో రైతుకంట కన్నీరు వలుకుతోంది. సుల్దానాబాద్‌,ఓదెల, ఎలిగెడు జుల్లపల్లి, కాల్యశ్రీరాంపూర్‌లో వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పుజేసి సాగుచేసిన వరిపంట... నీరులేక ఎండిపోయింది. పొలం నెర్రెలు వారింది. ఎండిపోయిన పంటను పశువులు మేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువలకు నీరు విడుదల చేస్తే ఈ పరిస్థితి దాపురించేంది కాదని...

Sunday, January 21, 2018 - 06:43

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నభూతో నభవిష్యత్‌ అన్నట్టు ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ గొప్ప ప్రాజెక్ట్‌ అంటూ కొనియాడారు. ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన చేసిన గవర్నర్‌.. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌ దంపతులు ఉదయమే...

Saturday, January 20, 2018 - 13:24

కరీంనగర్ : జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్ నరసింహన్ పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నేపల్లి పంప్‌హౌజ్‌ను గవర్నర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పిల్లర్ల పనితీరును, మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ పరిశీలించారు. ప్రాజెక్టు పనితీరును మంత్రి హరీష్‌రావు...గవర్నర్‌కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, మూడు షిఫ్టుల్లో...

Saturday, January 20, 2018 - 07:31

హైదరాబాద్/కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్‌ నరసింహన్‌ ఇవాళ పరిశీలిస్తారు. ఉదయం 7.45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి బయలు దేరుతారు. ఉదయం 8.30 నిమిషాలకు కాళేశ్వరం ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 8.30 నుంచి ఉదయం 9 వరకు కాళేశ్వరం...

Wednesday, January 17, 2018 - 16:03

కరీంనగర్ :మేడారం జాతర ముగిసేదాకా తెల్లబెల్లం అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో ఎక్సైజ్ కేసులపై రివ్యూ నిర్వహించారు. తెల్లబెల్లంపై ఆంక్షలు లేవని.. అయితే నల్ల బెల్లం అమ్మితే తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. GHMC పరిధిలో... బహిరంగ ప్రదేశంలో మద్యపాన నియంత్రణపై...

Wednesday, January 17, 2018 - 11:11

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీరాంసాగర్ రెండు కెనాల్ల ద్వారా పెద్దపలి నియోజకవర్గానికి నీరందుతోంది. డీ 83, డీ 86 కెనాళ్లకు నీరు విడుదల చేయకపోడంతో చివరి ఆయుకట్టు రైతులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీరు...

Wednesday, January 17, 2018 - 09:24

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఎస్ఆర్ ఎస్ పి నీటిని కాకతీయ కెనాల్ ద్వారా తన నియోజకవర్గానికి మంత్రి ఈటెల విడుదల చేయడంతో వివాదం ప్రారంభమైంది. మంత్రి ఈటెల చర్యను రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేశారని..ఇతర...

Pages

Don't Miss