కరీంనగర్
Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Thursday, January 11, 2018 - 07:18

కరీంనగర్ : సవతి తల్లి కర్కశత్వానికి కరీంనగర్‌లో కావేరి అనే పదవతరగతి బాలిక బలైంది. కొందరు గ్రామస్థులతో కలిసి గొంతు నులిమి చంపిన సవతి తల్లి... ఆత్మహత్యగా చిత్రీకరించింది... మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో... స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలితోపాటు... ఆమెకు సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Wednesday, January 10, 2018 - 17:45

 కరీంనగర్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నిధుల గండం పొంచివుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం 5 వేల 600 కోట్ల రూపాలయ వ్యయంతో పునర్నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదు. అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడికి వాటాలు పూర్తయ్యాయి. మిగిలిన 26 శాతం వాటా పెట్టుబడుల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రామగుండం...

Tuesday, January 9, 2018 - 21:38

శాతావాహన యూనివర్శిటీలో తెంగాణ ఉద్యమం నుంచి పోరాటం చేస్తుందని, అనేక మంది పోరాటలకు తను అండగా నిలుచున్ననాని, ఆ రోజు ఆర్ఎస్ఎస్ వారు భారత్ ఎందుకు తీసుకొచ్చారని, మనస్తృతిని దహనం చేసుటప్పడు తను అక్కడ లేనని ప్రొ. సూరపల్లి సుజాత అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, January 9, 2018 - 16:05

కరీంనగర్/సిరిసిల్ల : ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాజీ ఎమ్మల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Monday, January 8, 2018 - 21:54

కరీంనగర్‌ : తెలంగాణలో ఐటీ ప్రాభవాన్ని మరింతగా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటివరకూ హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీని.. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకూ విస్తరించే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా.. కరీంనగర్‌లో ఐటీ టవర్‌ నిర్మాణానికి..  మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 25 కోట్ల రూపాయలతో 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌...

Monday, January 8, 2018 - 16:16

కరీంనగర్ : ఆధునికంగా మనం ఎంతగా ఎదుగుతున్నా.... సమాజంలో మూఢనమ్మకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీధికో బురుడీ బాబా దుఖాణం తెరుస్తున్నాడు.. తాజాగా కరీంనగర్‌లో  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ దొంగ బాబాను అరెస్ట్‌ చేశారు... నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బరితెగిస్తున్న బురిడీ బాబాలు
ఆధునికంగా ఎంత...

Monday, January 8, 2018 - 10:16

కరీంనగర్ : వేముల వాడ ఆలయం వద్ద ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆలయం పార్కింగ్ వద్ద ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు..బ్లేడు..కత్తులతో దాడులు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దుండగులు పరారయ్యారు. చనిపోయిన వ్యక్తి మెదక్ జిల్లా ఘన్ పూర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు....

Friday, January 5, 2018 - 21:35

కరీంగనర్ : 10టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలుస్తుందంటూ అభినందించారు గంగాధర మండల సర్పంచ్‌ వైద రామానుజం. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలో 10టీవీ క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఛానెల్‌ ప్రారంభమైన అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందిందని కితాబిచ్చారు. మండల ప్రజలందరికి..10టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

 

Pages

Don't Miss