కరీంనగర్
Thursday, January 4, 2018 - 18:01

కరీంనగర్ : జిల్లా హుజురాబాద్‌లో జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగళి రమేష్‌ టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పింగళి రమేశ్‌ అన్నారు. టెన్‌టీవీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతోపాటు కార్మికులు పాల్గొన్నారు.

Wednesday, January 3, 2018 - 17:34

కరీంనగర్ : లోయర్‌ మానేరు డ్యామ్‌ చివరి ఆయకట్టు రైతాంగానికి సాగునీరిచ్చి ఆదుకుంటామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కాలువకు ఆయన ఎంపి వినోద్‌ కుమార్‌తో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలాశయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దిగువకు నీటిని విడుదల చేశారు. ఆన్‌ ఆఫ్‌ సిస్టమ్‌ ద్వారా వారం రోజుల పాటు హుజురాబాద్‌, మానకోండుర్‌,...

Monday, January 1, 2018 - 21:37

కరీంనగర్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక లోటుతో ఉన్న విద్యుత్‌ కాస్తా మిగులు విద్యుత్‌ గా మారిందని ఆయన అన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కేశారం గ్రామంలో ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి నేటి నుండి 24గంటల ఉచిత విద్యుత్‌...

Monday, January 1, 2018 - 18:08

కరీంనగర్/సిరిసిల్ల : నూతన సంవత్సరం రోజు వేములవాడ రాజన్న దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం మొదటిరోజు సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారికి తలనీలాలర్పించారు. కోడె మొక్కులు చెల్లిస్తూ.. ధర్మగుండంలో స్నానమాచరించారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక...

Monday, January 1, 2018 - 16:12

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మంథని ప్రబుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈటల కాలేజీ నుంచి వెళ్లిపోగానే తరగతి గదిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ సహచరుడు మద్యం సేవించాడు. శ్రీనివాస్ మద్యం తాగుతున్న కాలేజీ సిబ్బంతి పట్టించుకోవడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Saturday, December 30, 2017 - 18:03

కరీంనగర్ : తెలంగాణ చిత్రపటంపై కరీంనగర్‌ను నంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ వస్తారని ఆయన చెప్పారు. కరీంనగర్ మానేరు నదిపై 149 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులు శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా కరీంనగర్ నుంచి సదాశివపల్లి...

Friday, December 29, 2017 - 15:37

కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీలో విద్యార్ధుల ఘర్షణపై ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత స్పందించారు. మనుస్మృతులను దగ్ధం చేస్తే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లకు ఎందుకు ఆగ్రహం వస్తుందని ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతవరకూ సమంజసమంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర కామెంట్లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు....

Pages

Don't Miss