కరీంనగర్
Sunday, September 25, 2016 - 12:32

కరీంనగర్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్‌ చెరువుకు గండిపడింది. దీంతో గ్రామంలోకి భారీగా  వరదనీరు చేరింది. ఈ వరదనీటిలో రెండు ఇళ్లు, పశువులు కొట్టుకుపోయాయి. గంభీరావుపేట, గోరంట్లలోను వరద ఉధృతి కొనసాగుతోంది.

 

Saturday, September 24, 2016 - 21:36

హైదరాబాద్ : తెలంగాణలో వర్ష బీభత్సం సృష్టించిన విలయ తాండవానికి ఇంకా ప్రజానీకం తేరుకోలేదు. అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో కనీసం నిద్రాహారాలు కూడా మానేసి ఎదురు చూపులు చూస్తున్న బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో రోడ్లన్నీ తెగిపోయి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరమైతే తప్పా...

Saturday, September 24, 2016 - 10:52

కరీంనగర్ : జిల్లాలోని ఎగువమానేరు నర్మాల ప్రాజెక్టు పూర్తిస్ధాయిలో నిండి అలుగుపారుతోంది. 32 అడుగుల సామర్ధ్యం గల ప్రాజెక్టు రాత్రి పూర్తిగా నిండిపోయి పెద్దఎత్తున మత్తడి పడింది. మానేరు వాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులతో పాటు ఎస్సారెస్పీ వరదకాలువల ద్వారా భారీగా వరద నీరు లోయర్ మానేరు డ్యామ్ కు చేరుతోంది. 

 

Friday, September 23, 2016 - 21:47

హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు మోత మోగిస్తున్నాయి. వరంగల్‌, నల్గొండతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలతో జనజీవనం అల్లాడుతోంది. ఎక్కడ చూసినా రోడ్లు, కుంటలు, చెరువులు తెగిపోయి వరదలు పోటెత్తుతున్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడటంతో రాకపోకలు స్థంభించాయి.

నల్లగొండలో వృద్ధురాలు మృతి..
నల్లగొండ జిల్లాలో...

Friday, September 23, 2016 - 17:43

కరీంనగర్ : మార్కెట్‌ కమిటీలలో కీలక పదవులను బీసీ..ఎస్సీ..మైనార్టీలకు కేటాయిస్తున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని ఎంపీ కవిత అన్నారు. కరీంనగర్‌ జిల్లా.. జగిత్యాల పట్టణంలో ఎంపీ కవిత పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల మార్కెట్‌...

Friday, September 23, 2016 - 17:40

కరీంనగర్ : భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. దీంతో 15 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీరు వరద కాల్వ ద్వారా లోయర్‌ మానేరు డ్యామ్‌కు చేరనుంది. నీళ్లు విడుదల చేయడం వల్ల షాబాష్‌పల్లి వంతెన మునిగిపోనుంది. దీంతో కరీంనగర్‌-వేములవాడ మధ్య రాకపోకలు...

Wednesday, September 21, 2016 - 07:08

కరీంనగర్ : ప్రశాంతంగా ఉన్న పల్లెలను వరద ముంచెత్తింది. పోలాలను నీట ముంచింది. పిల్ల పాప,పశువులతో బయటకు తరలి వెళ్లిపోయేల చేసింది. ఊహించని రీతిలో పోటెత్తిన వరదతో ఆ పల్లే జనం ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అధికారుల నిర్లక్ష్యం...నాసిరకం పనులు...సమన్వయం లేక పోవడంతో కరీంనగర్ జల్లా మల్యాల మండలం మానాల వద్ద శ్రీరాం సాగర్ ప్రాజెక్టు...

Tuesday, September 20, 2016 - 16:14

కరీంనగర్ : మల్యాల మండలం మానాల సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రధాన కాకతీయ కాలువకు పడ్డ గండితో... పలు గ్రామాలు నీట మునిగాయి. మేడంపల్లి, చిలువకోడూరులో పంటపొలాలు నీటమునిగాయి. దీంతో అధికారులు.. పరిసర గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరింత సమాచారానికి వీడియో చూడండి..

Tuesday, September 20, 2016 - 12:55

కరీంనగర్‌ : జిల్లాలోని సిరిసిల్లలో బంద్‌ కొనసాగుతోంది. జేఏసీ 48గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్‌ సాగుతోంది. సిరిసిల్ల బంద్‌కు కుల సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరిస్తున్నాయి. ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష నేతలు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను తగులబెట్టారు. పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌పై దాడి...

Tuesday, September 20, 2016 - 11:23

కరీంనగర్ : జిల్లాలోని మల్యాల మండలం మానాల సమీపంలో శ్రీరాంసాగర్‌ ప్రధాన కాకతీయ కాలువకు గండిపడి నీరు పెద్ద ఎత్తున వృథాగా పోతుంది.  కాలువకు గండిపడటంతో మానాల చెరువు తెగి .. సమీప  గ్రామాస్థులు భయందోళనకు గుర‌వుతున్నారు. ఇప్పటికే మ్యాడం పల్లి గ్రామానికి ప్రమాదం పొంచి ఉండటంతో గ్రామ‌స్థుల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది ఎకరాల్లో పంటలు ముంపున‌కు గురయ్యాయి. ఎగువ నుంచి వ‌చ్చే...

Pages

Don't Miss