కరీంనగర్
Sunday, June 24, 2018 - 06:43

కరీంనగర్ : పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన సీపీఐ సమావేశంలో పాల్గొన్న నారాయణ... డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్‌ నెరవేర్చాలన్నారు నారాయణ. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి... 2019 ఎన్నికల్లో హుస్నాబాద్‌లో...

Saturday, June 23, 2018 - 11:37

కరీంనగర్ : జిల్లాలో 29ఏళ్ల క్రితం మిస్టరీ వీడింది. ఇరుకుల్ల వాగులో వరద ఉధృతికి ఆనాడు ఓ లారీ కొట్టుకపోయింది. అందులో ఉన్న దౌలత్ ఖాన్, శంకర్, వెంకట స్వామిలు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కనుగొనాలంటూ పోలీసులను కుటుంబసభ్యులు కోరారు. కానీ ఇసుక మేటలు వేయడంతో లారీ ఆనవాళ్లు కనిపించలేదు. దీనితో అప్పటి నుండి ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది. తాజాగా ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నాడు....

Saturday, June 23, 2018 - 09:50

కరీంనగర్ : ఓ కౌలు రైతు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీనితో భార్యను చంపేసిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లందుకుంట మండలం సిరిసేడు గ్రామంలో స్వామి మల్లయ్య, పుట్ట రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. స్వామి కౌలు రైతు. పంటలకు తీవ్ర నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీనితో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శుక్రవారం మద్యం సేవించిన స్వామి...

Saturday, June 23, 2018 - 06:59

జగిత్యాల : ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిలివేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని హరీశ్‌ తప్పుపట్టారు. జగిత్యాల జిల్లా హలికోటలో సూరమ్మ చెరువు, నాగారం...

Friday, June 22, 2018 - 09:36

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మంథనికి చెందిన అరుణ్, సౌమ్య దంపతులు కారులో వెళుతున్నారు. వీరితో పాటు వారి సంతానం అఖిలేష్ శాన్వి (8) కూడా ప్రయాణిస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొంది. దీనితో అక్కడికక్కడనే నలుగురూ మృతి చెందారు. అరుణ్ మంథని...

Tuesday, June 19, 2018 - 12:30

కరీంనగర్‌ : జిల్లాలో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన దంపతులు తిరుపతి (40), నిర్మల( 35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.  తమ ఎకరం పొలాన్ని పక్కింటివారే కబ్జా చేయడంతో  మనస్తాపం చెంది ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. పురుల మందు తాగడంతో పరిస్థితి విషమించింది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స...

Tuesday, June 19, 2018 - 12:02

కరీంనగర్ : కలెక్టర్ ఎదుట దళితుల పేరిట వెలసిన ఓ ప్లెక్సి చర్చనీయంశంగా మారింది.  రామడుగు గ్రామ దళితుల పేరిట  ప్లెక్సీని సోమవారం రాత్రి  ఏర్పాటు చేశారు. 62 ఏళ్లుగా గ్రామసర్పంచ్ రిజర్వేషన్ దళితులకు కేటాయించకుండా బీసీలకు కేటాయిస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతుందని ఇందులో పేర్కొన్నారు. దళితుల సంఖ్య అధికంగా ఉన్న గ్రామంలో దళితులకు రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని  ప్రభుత్వాన్ని...

Monday, June 18, 2018 - 17:57

కరీంనగర్‌ : ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో మల్టీప్లెక్స్‌ వస్తుందన్న ప్రచారం అవాస్తవమన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. వ్యవసాయ రంగంలో కరీంనగర్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ది ఉందని... అందుకే 12 వేల కోట్ల పెట్టుబడి సాయం చేశామన్నారు ఈటల. 

Monday, June 18, 2018 - 11:07

కరీంనగర్ : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురాతన ఆర్ట్స్ కాలేజీలో ఉన్న నిర్మాణల కూల్చివేతను నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మంత్రి ఈటెలను అడ్డుకొనే ప్రయత్నించారు. అక్కడనే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇందులో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులతో కనీసం మాట్లాడనీయకుండా మంత్రి ఈటెల...

Friday, June 15, 2018 - 19:56

కరీంనగర్ : ప్రేమోన్మాది దాడికి మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతిని దారుణంగా హత్య చేసాడు ఓ ఉన్మాది. కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతు రసజ్న మృతి..
కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తూ రసజ్ఞ అనే యువతిని దారుణంగా గొంతు కోసి చంపాడు వంశీధర్‌...

Pages

Don't Miss