కరీంనగర్
Wednesday, March 16, 2016 - 17:44

కరీంనగర్: క్షణాల వ్యవధిలో రెండు ప్రమాదాలనుంచి ఇద్దరు మహిళలు తృటిలో తప్పించుకున్నారు.. కరీంనగర్‌ జిల్లాలో బైక్‌వెనక కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ జారి కిందపడింది.. అదే సమయంలో ఆమెపైకి టిప్పర్‌ దూసుకొచ్చింది.. డ్రైవర్‌ వెంటనే బ్రేక్‌ వేయడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.. తలకు గాయాలైన ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే అక్కడే మరో మహిళ...

Thursday, March 10, 2016 - 18:51

కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు కదం తొక్కారు. కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ, ఐఎన్ టీయూసీ, హెచ్ ఎంఎస్, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కార్మికులకు కనీసం వేతనం అమలు చేయడంలేదని.. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడంలో సర్కారు విఫలమైందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. 

Thursday, March 10, 2016 - 18:40

కరీంనగర్‌ : టీచర్‌ ట్రైనింగ్‌లోనే తన ప్రతాపం చూపాడో డీఈడీ విద్యార్థి.. డ్యాన్స్ చేయలేదంటూ ఎనిమిదేళ్ల చిన్నారిని చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బాన్స్ వాడ మండలం ఇబ్రహీంపేట్‌ ప్రాథమిక పాఠశాలకు క్రాంతికుమార్‌ అనే యువకుడు ఉపాధ్యాయ శిక్షణ కోసం పాఠశాలకు వచ్చాడు. మూడో తరగతి చదువుతున్న దివ్యను నృత్యం చేయాలని ఆదేశించాడు. డ్యాన్స్ చేయకపోవడంతో పాపను...

Thursday, March 10, 2016 - 18:34

కరీంనగర్ : తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పులు మరింత పెరిగాయని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్టాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 60వేల కోట్ల రూపాయల అప్పుంటే.. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చార ఇది లక్షా అరవై వేలకోట్లకు చేరిందని ఆరోపించారు. రీ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం...

Monday, March 7, 2016 - 17:33

తెలంగాణలోని ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి.. మహా శివరాత్రిరోజు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.. స్వామివారిని దర్శించుకొని భక్తిభావంలో మునిగిపోయారు. మహాశివరాత్రి వేడుకలతో తెలంగాణలోని ఆలయాలన్నీ సందడిగామారాయి. వరంగల్‌ వేయి స్తంబాల గుడిలో శివుడి నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామునుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూకట్టారు. అయితే రద్దీ పెరిగి దర్శనం కోసం భక్తులు...

Monday, March 7, 2016 - 13:58

కరీంనగర్ : వేములవాడ ఆలయంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచివున్నా తమను పట్టించుకోవడం లేదని.. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటున్నారు. కొంతమంది కళ్లు తిరిగి పడిపోయినా పోలీసులు, ఆలయ సిబ్బంది  పట్టించుకోవడ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

Sunday, March 6, 2016 - 20:34

కరీంనగర్‌ : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిధుల కేటాయింపునకు సంబంధించి జెడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. సమావేశానికి హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు 64 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపితే కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు అయ్యాయి. దీనిపై జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరుకాకుండా బయటే ఉండిపోయారు....

Wednesday, March 2, 2016 - 13:20

కరీంనగర్ : జిల్లా కోరుట్లలోని సినారె కళాభవన్‌లో ఫాల్కన్‌ ఆధ్వర్యంలో రైతులకు మెకానిక్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కంపెనీ సంబంధిత పంపుసెట్లు, స్టార్ రేటింగ్స్ పంప్స్‌, సోలార్ సిస్టం పంప్స్, డ్రిప్ సిస్టం, స్ప్రింకర్లకు సంబంధించిన పనితీరుపై అవగాహన కల్పించారు. పంపు సెట్లు పనిచేసే విధానం, విద్యుత్, నీటి సమస్యలను అరికట్టే పద్ధతులను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల...

Wednesday, March 2, 2016 - 10:28

కరీంనగర్ : జిల్లాల్లో ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను విద్యామండలి పూర్తి చేసింది. బుధవారం ప్రథమ సంవత్సరం, గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనన్నారు. జిల్లాలో 129 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 43,768 మంది, ద్వితీయ సంవత్సరంలో 52,511 మంది మొత్తం 96,279 మంది విద్యార్థులు పరీక్షలు...

Wednesday, March 2, 2016 - 06:28

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించేది లేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 9,93,891 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు....

Tuesday, March 1, 2016 - 22:26

హైదరాబాద్ : కరీంనగర్ నిర్భయ ఘటనపై టెన్ టివి కథనాలకు టీసర్కార్ స్పందించింది. ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేసింది.  

Pages

Don't Miss