ఖమ్మం
Sunday, April 30, 2017 - 21:49

ఖమ్మం : మిర్చి మార్కెట్‌ యార్డు ధ్వంసం ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమందిని పోలీసులు  ఇవాళ  అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో వారికి  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మరిన్ని విరాలను వీడియో చూద్దాం...

 

Sunday, April 30, 2017 - 08:09

ఖమ్మం : పుడమినే నమ్ముకున్నారు. పుట్టెడు కష్టాలను తట్టుకుని ఇంటిల్లిపాదీ శ్రమించారు. మొక్కమొక్కకూ నీరుపోసి ప్రాణంగా పెంచారు. తెగుళ్ల బారిన పడిన పంటను పురుగుమందు చల్లి కాపాడుకున్నారు. శ్రమనంతా ధారపోసి దిగుబడి తీశారు. ఎన్నో ఆశలతో పంటను మార్కెట్‌ను తరలిస్తే అన్నదాతకు ఆక్రందనే మిగిలింది. గిట్టుబాటు ధరలేక మిర్చిరైతు అల్లాడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోతే ప్రభుత్వంపై కన్నెర్రజేశారు....

Saturday, April 29, 2017 - 22:25
Saturday, April 29, 2017 - 20:38

ఖమ్మం : టీప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క్ మండిపడ్డారు. ఖమ్మం మిర్చియార్డులో వ్యాపారులు, దళారులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రైతును దోచుకుంటున్నారని .. ఆయన ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో 12 వేలు ఉన్న మిర్చి ధర ప్రస్తుతం 2వేలకు పడిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల...

Saturday, April 29, 2017 - 20:33

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేదని మనస్తాపంతో రమేష్‌.. ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలైన రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. పూర్తి వివరాలను...

Saturday, April 29, 2017 - 18:48

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మిర్చి రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మిర్చికి గిట్టుబాటు ధర లేదని మనస్తాపంతో రమేష్ అనే రైతు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

Saturday, April 29, 2017 - 16:11

ఖమ్మం : జిల్లాలో మిర్చి రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా... అక్రమ అరెస్టులు చేస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

 

Saturday, April 29, 2017 - 13:39

ఢిల్లీ : కేంద్రం మిర్చికి మద్దతు కల్పిస్తుందని కేంద్ర మంత్ర బండారు దత్తాత్రేయ టెన్ టివి తెలిపారు. అయితే మిర్చి వణిజ్య పంట అని దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. కానీ తను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడానని తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపితే ఆలోచిస్తామని చెప్పారని తెలిపారు. ఈ సారి రైతులు 3 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారని అన్నారు. రైతులపై లాఠీ చార్జీ చేయడం...

Saturday, April 29, 2017 - 13:31

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చ నాయకుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ముదిగొండకు చెందిన రైతు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ముదిగొండ పీఎస్‌లో మల్లు భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. 

Pages

Don't Miss