ఖమ్మం
Tuesday, July 31, 2018 - 13:27

ఖమ్మం : జిల్లా వైరా రిజర్వాయర్ ఆయకట్టులో నారుమళ్లు నోళ్లు తెరుస్తున్నాయి. మిషన్ భగీరథ పథకం కోసం వైరా రిజర్వాయర్లో 1.28 టిఎంసీలు నిల్వ ఉంచాలన్న నిర్ణయంతో.. నీటిని విడుదల చేయడంలేదు. దీంతో వైరా రిజర్వాయర్ పరిధిలోని 25వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతాంగం ఆందోళన చెందుతోంది.

2016, 2017లో వరుసగా...

Friday, July 27, 2018 - 19:41

ఖమ్మం : మధిరలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మధిరలోని షిరిడిసాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. పసరా గ్రూపు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

Friday, July 27, 2018 - 06:29

భద్రాద్రి : అపర శబరి పోకల దమ్మక్క. రాముడిని పూజించిన మానవోత్తమురాలు. ఈ మహా భక్తురాలికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహిస్తారు భద్రాద్రి అధికారులు. ఈ పూజలకు పెద్ద ఎత్తున గిరజన ప్రజలు హాజరవుతారు. గిరిజన ప్రజల కోసం అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి పూజలకు చంద్రగ్రహణం అడ్డంకిగా మారింది. చంద్రగ్రహణంతో ఇవాళ జరగబోయే పూజలు నిలిచిపోనున్నాయి.

భద్రగిరి...

Wednesday, July 25, 2018 - 17:51

ఖమ్మం : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని సీపీఎం నేతలు విమర్శించారు. ప్రైవేటు వ్యక్తులకు ఫ్యాక్టరీని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకు పోరాటాన్ని ఆపేది లేదని సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ నేతలు...

Wednesday, July 25, 2018 - 16:10

ఖమ్మం : తెలంగాణలో ఉన్న ముఖ్యమైన చెరువులకు ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. అయితే కాంట్రాక్టర్‌ల కక్కుర్తి ఆ నిర్మాణాల నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది. వాచ్‌ ది స్టోరీ

ఖమ్మం జిల్లా కేంద్రంలో ట్యాంక్‌బండ్‌ నిర్మాణం
ఖమ్మం జిల్లా కేంద్రంలో ట్యాంక్‌బండ్‌ ఇది. ఆది నుంచి దీని నిర్మాణం...

Wednesday, July 18, 2018 - 19:29

ఖమ్మం : పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు సీపీఎం నేతలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని 4 ఏళ్లు గడిచినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Wednesday, July 18, 2018 - 19:23

ఖమ్మం : నిరుద్యోగులకు ఓ సంస్థ టోకరా వేసింది. ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసింది 'ది హ్యాపీ ఫ్యూచర్‌ మల్టీపర్పస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ'.  ఒక్కో అభ్యర్థి నుండి 80 వేల రూపాయల నుండి లక్ష రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బ్యాంక్‌ సర్వీస్‌, లోన్లు ఇస్తామని నమ్మించి వ్యాపారులు, సామాన్యులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు కంపెనీ యాజమాన్యం పరారైంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Pages

Don't Miss