ఖమ్మం
Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Saturday, November 4, 2017 - 17:25

ఖమ్మం : చెమట చుక్క చిందించకుండా డబ్బులు సంపాదించాలి. ఖద్దర్‌ చొక్కా ఇస్త్రీ నలగకుండా కోట్లు కూడబెట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలతోనే..ఓ మంత్రి అనుచరులు ఆదివాసి భూములపై కన్నేశారు. అసైన్డ్‌ భూములను అప్పనంగా దోచేశారు. అంగబలం, అర్థబలంతో భూములను హస్తగతం చేసుకున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో జోగడంతో తమకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిన అక్రమార్కులపై 10టీవీ స్పెషల్ రిపోర్ట్....

Wednesday, November 1, 2017 - 16:20
Tuesday, October 31, 2017 - 13:24

ఖమ్మం : జిల్లాలోని కలెక్టరేట్‌ తరలింపు వ్యవహారంపై అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి క్యాంప్‌ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. గొల్లపూడెం రోడ్డులో పలువురు సీపీఎం, సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Tuesday, October 31, 2017 - 13:18

ఖమ్మం : తన్విత వ్యవహారంలో కన్నతల్లి, పెంచిన తల్లి మధ్య జరిగిన వివాదం హైకోర్టుకు చేరింది. పెంపుడు తల్లి హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఇల్లందు పీఎస్‌లో నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేసింది. అదేవిధంగా సీడబ్ల్యుసీ అధికారుల తదుపరి చర్యలు నిలిపివేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తన్వితను తనకే ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంది...

Friday, October 27, 2017 - 19:00

ఖమ్మం : నాలుగు రోజులుగా ఇద్దరు తల్లులకు దూరమై చిన్నారి తన్విత బాలల సదన్‌కు చేరుకుంది. చిన్నారి మానసిక పరిస్థితిని పరీక్షించేందుకు చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి ప్రసాద్‌, ఐసిడిఎస్‌ పిడి విజయలక్ష్మి బాలసదన్‌కు వచ్చారు. చిన్నారి తన్వితతో ముచ్చటించారు. చట్టం ప్రకారమే తన్వితను ఎవరికి అప్పగించాలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Thursday, October 26, 2017 - 18:43

ఖమ్మం : చిన్నారి తన్విత కోసం ఇద్దరు తల్లులు బాలసదన్‌కు వచ్చారు. తన్వితను తనకే అప్పగించాలంటూ వారు డిమాండ్‌ చేశారు. బాలసదన్‌ ఎదుట ఇద్దరు తల్లులు ధర్నాకు దిగి... సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఇద్దరు తల్లులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

 

Wednesday, October 25, 2017 - 11:58

 

మహబూబాబాద్ : పేగుబంధం ఒకవైపు.. పెంచిన మమకారం మరోవైపు. పుట్టగానే సొంత బిడ్డను అమ్ముకున్నాడు కసాయి తండ్రి. మూడేళ్ల తర్వాత నిజం తెలుసుకున్న కన్నతల్లి బిడ్డ కోసం అధికారులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పెంచిన తల్లి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. పెంచినతల్లి బిడ్డ దూరం కావడంతో తల్లడిల్లుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కృష్ణాపురం...

Wednesday, October 25, 2017 - 08:12

నల్గొండ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ 'పల్లె నిద్ర' తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో నిన్న సాయంత్రం నుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గాద కిశోర్ 'పల్లె నిద్ర' పేరిట పలు గ్రామాల్లో నిద్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నూతనల్ కల్ (మం) వెంకెపల్లి గ్రామానికి చేరుకన్న సమయంలో చాలా మంది గ్రామస్తులు..ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు....

Pages

Don't Miss